
టాప్ హీరో సినిమాకు నాన్ థియేటర్ రెవెన్యూతో 80% రికవరీ.. !
కొన్ని కొన్ని కాంబినేషన్లకు ఓటీటీ డిజిటల్ రైట్స్ కావాల్సిన అంత డబ్బు సమకూర్చి పెడుతూ ఉంటాయి. ప్రతి సినిమాకు ఇదే జరుగుతుంది అనుకోవటం భ్రమ. స్టార్ హీరోల సినిమాలకు ఇలాంటివి కలిసి వస్తూ ఉంటాయి. క్రేజీ కాంబినేషన్లకు తోడు.. హీరోల ఇమేజ్ కలిసి వస్తే ఇలా లాభపడుతూ ఉంటారు. ఏ ఆర్. మురుగదాస్ డైరెక్షన్‌లో.. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న సికిందర్ అనే సినిమా ఇప్పుడు ఇలా లాభపడుతోంది. గత కొన్నాళ్లుగా సల్మాన్ ఖాన్ సినిమాలో అద్భుతాలు చేయడం లేదు. అయితే ఈ సినిమాకు డిజిటల్ రైట్స్ ద్వారానే ఏకంగా 80% రికవరీ అయిపోయిందట.
ఈ సినిమాను విడుదలకు ముందే ఓటీటీ రైట్స్ అమ్మేశారు. రూ.85 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ రైట్స్ సొంతం చేసుకుంది. ఒకవేళ ఈ సినిమా రూ.350 కోట్లు.. అంతకుమించి థియేటర్ వసూళ్లు రాబడితే ఆ సంస్థ మరో రూ.15 కోట్లు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందట. కనీసం రూ.85 కోట్లనుకుంటే దానికి అదనంగా మ్యూజిక్ రైట్స్ కూడా భారీ రేటుకు అమ్ముడుపోయాయట. ఈ సినిమా మ్యూజిక్ రైట్స్‌ను జియో మ్యూజిక్ కంపెనీ రూ.30 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక టీవీ రేట్స్ ను జీ నెట్వర్క్ రూ.50 కోట్లకు సొంతం చేసుకుంది. ఇలా నాన్ ధియేటర్ రెవెన్యూ రూ.165 కోట్లకు పైనే దక్కిందట. ఈ సినిమా బడ్జెట్ కూడా మరీ భారీ స్థాయిలో లేదు.
సినిమాకు సల్మాన్ ఖాన్ పారితోషికాన్ని పక్కన పెడితే మొత్తంగా బడ్జెట్ రూ.200 కోట్ల వరకు ఉంటుందని అంచనా. రూ.200 కోట్ల బడ్జెట్కు అటు.. ఇటుగా.. 80 శాతం డబ్బు డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారానే సమకూరుతోంది. ఎలాగో థియేటర్ విషయంలో ఓపెనింగ్స్‌కు కొదవ ఉండదు. బాలీవుడ్‌లో దక్షిణాది దర్శకుల సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వస్తున్న కాలం ఇది. దీంతో ఈ సినిమాకు అలాంటి ఇబ్బంది కూడా లేదు. సల్మాన్ ఖాన్ ఇప్పుడున్న పరిస్థితులలో ఇది సేఫ్టీ వెంచర్ అవుతుంది అనటంలో సందేహం లేదు.