"వాడి ముఖానికి హీరోనా.. చిరంజీవి లేకపోతే దమ్మిడికి పనికిరాడు"..చరణ్ పై నిర్మాత షాకింగ్ కామెంట్స్..!
మరి ముఖ్యంగా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరుత సినిమా టైమ్ లో ఆయనపై ఎలాంటి ట్రోలింగ్ జరిగిందో అందరికీ తెలిసిందే . అది ఎప్పటికీ మర్చిపోలేరు . అంత పెద్ద మెగాస్టార్ చిరంజీవి హీరో కొడుకు లుక్స్ ఈ విధంగా ఉంటాయా..? అసలు రామ్ చరణ్ ఒక హీరోనేనా..? చిరుత సినిమాలో ఆయన హ్యాండ్సమ్ గా ఉన్నాడా ..? అసలు ఇలాంటి లుక్స్ ఉన్న వ్యక్తి ఇండస్ట్రీలోకి హీరోగా ఎలా ఎంట్రీ ఇచ్చాడు..? అంటూ చాలా చాలా మంది జనాలు మాట్లాడుకున్నారు. దారుణంగా ట్రోల్ కూడా చేశారు.
అయితే జనాలు మాట్లాడుకున్నవి పెద్దగా తీసుకోలేదు మెగా ఫ్యాన్స్ . కానీ ఒక ప్రొడ్యూసర్ మాత్రం రామ్ చరణ్ పై చాలా చాలా నెగటివ్‌గా మాట్లాడారు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . మరి ముఖ్యంగా రామ్ చరణ్ ఇంట్రడ్యూస్ చేయమంటూ ఆ ప్రొడ్యూసర్ వద్దకు వెళ్లిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో అసలు వాడిని ఎవడయ్య హీరోగా పెట్టుకుంటున్నారు ..? వాడి ముఖానికి హీరో అయ్యే లక్షణాలు ఉన్నాయా ..? అంటూ చాలా దారుణంగా మాట్లాడారట . అంతేకాదు అసలు వాడితో హీరోగా సినిమా తెరకెక్కించిన ..నిర్మించిన వాళ్లకే బొక్క అంటూ హీనంగా టార్గెట్ చేసి మరి కావాలని చరణ్ ఇండస్ట్రీలో హీరోగా రానివ్వకుండా ట్రై చేశారట . కానీ అలాంటివేవీ పట్టించుకోని చిరంజీవి ధైర్యంగా చరణ్ టాలెంట్ ని నమ్ముకొని ఇండస్ట్రీలో ఆయన ను హీరోగా ఎంట్రీ ఇప్పించాడు. ఇప్పుడు ఆయన గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఇండియన్ ఫిలిం హిస్టరీ కి ఆస్కార్ తీసుకువచ్చిన ఘనతలో రామ్ చరణ్ కూడా భాగమయ్యాడు..!