యంగ్ టైగర్ ఎన్టీఆర్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ భారీ యాక్షన్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. గురువారం హైదరాబాద్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. దాదాపు మూడువేల మంది జూనియర్ ఆర్టిస్టులపై కీలకమైన సీన్స్‌ను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్నాడు. ఎన్టీఆర్ లేకుండానే షూటింగ్ జరుగుతోంది. మార్చి నెలాఖరు నుంచి ఆరంభమయ్యే తదుపరి షెడ్యూల్‌లో ఎన్టీఆర్ పాల్గొననున్నట్లు సమాచారం.కాగా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పీరియాడికల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోన్నట్లు చెబుతోన్నారు. లేటెస్ట్ షెడ్యూల్ కోసం అలనాటి కోల్‌కతా సిటీని తలపించేలా భారీ సెట్స్ వేసినట్లు తెలిసింది. అణగారిన వర్గాల కోసం పోరాటం చేసిన ఓ నాయకుడి కథతో పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను రూపొందిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదిలావుండగా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్‌చేశారు. జనవరి 9, 2026న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ మూవీలో గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఇప్పటివరకు చేయనటువంటి మాస్ క్యారెక్టర్‌లో ఎన్టీఆర్ కనిపించబోతున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.అయితే ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ అద్భుతంగా ఉండబోతుందట. ప్రశాంత్ నీల్ మాస్ ఎలివేషన్స్ తో ఈ సీన్స్ ను నింపెయబోతున్నట్టుగా తెలుస్తోంది.ఇక సలార్ ఇంటర్వెల్ సీన్ ను కనక చూసినట్టయితే అందులో ప్రభాస్ అచ్చం డైనోసార్ లానే కనిపిస్తాడు.మరి ఇలాంటి యాక్షన్ ఎపిసోడ్స్ ని తెరకెక్కించగలిగే ప్రశాంత్ నీల్ 2000 మందితో ఒక యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది.
మరి వీళ్లందరితో ఒక యాక్షన్ ఎపిసోడ్ అయితే ఉంటుందట.అది ఆల్మోస్ట్ మనం ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా చూడని విధంగా భారీ ఎమోషన్స్ తో చాలా క్రూరంగా ఉండబోతుందట.ఈ సినిమాకి ఆ ఫైట్ హైలెట్ గా నిలవబోతోందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ప్రస్తుతం బాలీవుడ్ మూవీ వార్ 2 షూటింగ్‌తో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీతోనే బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తోన్నాడు. ఈ యాక్షన్ మూవీలో హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నాడు. వార్ 2లో ఎన్టీఆర్ క్యారెక్టర్ నెగెటివ్ షేడ్స్‌లో సాగుతుందని సమాచారం.ఇక ఎన్టీఆర్ దేవర 2 కూడా చేయాల్సి ఉంది. కానీ ఆ సినిమా షూటింగ్ ప్రారంభించడానికి ఇంకా సమయం ఉంది. ప్రశాంత్ నీల్ తో సినిమా పనులు పూర్తయిన తర్వాతే ‘దేవర 2’ సెట్ అవుతుందని చెబుతున్నారు. మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ చాలా బిజీ బిజీగా ఉంటున్నాడు.