చిక్కుల్లో మజాకా మూవీ.. సందీప్ కిషన్, రావు రమేష్ మధ్య గొడవలు..?

frame చిక్కుల్లో మజాకా మూవీ.. సందీప్ కిషన్, రావు రమేష్ మధ్య గొడవలు..?

Pandrala Sravanthi
తెలుగు ఇండస్ట్రీలో భారీ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరోలలో సందీప్ కిషన్ కూడా ఒకరు. ఇప్పటికే ఆయన ఎన్నో సినిమాల్లో నటించిన కానీ భారీ స్టార్డం మాత్రం పొందలేదు.. అలాంటి సందీప్ కిషన్ సినీ కెరీర్ ఒక సినిమా హిట్ అయితే మరో రెండు సినిమాలు ప్లాప్ అనే విధంగా తయారయ్యింది.. ఈ విధంగా సందీప్ కిషన్ హీరో గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పలు చిత్రాల్లో నటిస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన హీరోగా చేసినటువంటి మజాకా అనే మూవీ ఫిబ్రవరి 26న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు ధమాకా మూవీ డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించారు.. అయితే ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు కానీ సంక్రాంతి బరిలో పెద్ద పెద్ద సినిమాలు ఉండడంతో సినిమా డేట్స్ ను కాస్త ముందుకు జరిపారు.. 


ఇంకా రిలీజ్ కి నాలుగు రోజుల టైమే ఉండడంతో ప్రమోషన్స్ కార్యక్రమంలో కాస్త గొడవలు వచ్చినట్టు తెలుస్తోంది. కీలక పాత్రలో నటిస్తున్నటువంటి రావు రమేష్ తో హీరో సందీప్ కిషన్ కు ఎక్కడో చెడిందట.. దీనివల్ల ఇద్దరరూ ఎదురుగా వస్తే గొడవే జరుగుతుందట.. ఆయన వచ్చినప్పుడు ఈయన రావడం లేదంట ఈయన వచ్చిన ఇంటర్వ్యూ కి ఆయన రావడం లేదట. ఇలా ఇద్దరి మధ్య కాస్త విభేదాలు రావడంతో ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయడం లేదని సమాచారం..


ఇలాగే కొనసాగితే మాత్రం సినిమాపై ప్రభావం పడే అవకాశం ఉందని సినిమా నిర్మాతలతో పాటు  సందీప్ కిషన్ అభిమానులు అంటున్నారు.. గొడవలు ఉంటే పర్సనల్గా చూసుకోవాలి కానీ సినిమా ను దెబ్బతీసే విధంగా చేయకూడదని కామెంట్లు పెడుతున్నారు. మరి నిజంగానే రావు రమేష్ సందీప్ కిషన్ ల మధ్య గొడవలు ఉన్నాయా..వీరిద్దరూ కలిసి ప్రమోషన్స్ లో ఎందుకు పాల్గొనడం లేదు అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: