పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ చేతిలో ఇప్పుడు చాలా సినిమాలున్నాయి. బాహుబలికి ముందు ఏడాదికి ఒక సినిమా అనే నిబంధన ఉండేది ప్రభాస్కి. ఈ విషయం ఆయన ఫిల్మోగ్రఫీ చూస్తే తెలుస్తుంది. దీంతో ప్రభాస్ ఏడాదికి ఒకే సినిమాలో నటించేవాడు. అయితే ఇప్పుడు డిమాండ్ పెరగడంతో ప్రభాస్ ఆ రూల్ ని బ్రేక్ చేసి ఏడాదికి రెండు మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. గతేడాది ప్రభాస్ నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. వచ్చే ఏడాది మూడు సినిమాలు విడుదల కానున్నాయి.ప్రభాస్ ప్రస్తుతం ‘రాజా సాబ్’ షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్నాడు. దీని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక ‘సీతా రామం’ ఫేమ్ రఘు హనుపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా లాంచ్ గత నెలలో జరగగా, షూటింగ్ కూడా మొదలైంది. ఆ సినిమా షూటింగ్ పూర్తి కాకముందే ప్రభాస్ మరో కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నాడు. ‘అర్జున్‌రెడ్డి’, ‘యానిమల్’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ చిత్రంలో ప్రభాస్ నటించనున్న సంగతి తెలిసిందే.స్పిరిట్’ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కథ అని సందీప్ రెడ్డి వంగా గతంలో చెప్పారు.
హీరోలకు భారీ ఎలివేషన్స్ ఇవ్వడంలో ప్రముఖంగా పేరుగాంచిన సందీప్ రెడ్డి వంగా తన సినిమాల హీరో కంటే ఎక్కువ పాపులర్ పర్సనాలిటీ సొంతం చేసుకున్నాడు. మరి అలాంటి సందీప్ రెడ్డి ప్రభాస్ కోసం ఎలాంటి కథను రాసుకున్నాడో, ఎలా తెరకెక్కిస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే ప్రస్తుతం స్పిరిట్ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాల్ని ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ వెల్లడించాడు. ఆల్రెడీ స్పిరిట్ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయని, ఉగాది రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలవుతుందని హర్షవర్ధన్ తెలిపాడు.హర్షవర్ధన్ చేసిన కామెంట్స్ విని ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.ఇక ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను షూటింగ్‌ను ఇండొనేషియా రాజధాని జకార్తాలో ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే సందీప్ అక్కడ లొకేషన్ రెక్కీ కూడా చేసినట్టు టాక్. అక్కడ కొన్ని పోలీస్ సీన్స్ షూట్ చేయబోతున్నారట. త్వరలోనే షూటింగ్‌తో అప్డేట్‌తో పాటు స్టార్ క్యాస్టింగ్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారు మేకర్స్.