
డాకు మహారాజ్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. ఆ సీన్స్ అన్ని కట్..!
అయితే ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా నెట్ ఫ్లిక్ విడుదల చేసిన పోస్టర్లో మిస్ అయినట్టుగా సోషల్ మీడియాలో ఒక చర్చ కొనసాగుతోంది. అయితే ఆ తర్వాత నెట్ఫ్లిక్స్ ఆమె ఫొటోను కూడా పోస్ట్ షేర్ చేయడం జరిగింది. అయితే తాజాగా వినిపిస్తున్న టాప్ మేరకు డాకు మహారాజ్ చిత్రంలో ఊర్వశి నటించిన సీన్స్ అన్ని కూడా తొలగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయమే అటు బాలయ్య అభిమానులను కూడా తీవ్రమైన నిరాశకు గురయ్యాలా చేస్తోందట. కొంతమంది నెటీజెన్స్ కూడా అసంతృప్తిని తెలియజేస్తున్నారు.
డాకు మహారాజ్ చిత్రంలో కీలకమైన పాత్రలో నటించి స్పెషల్ సాంగ్లో అలరించిన ఈ అమ్మడు ప్రమోషన్స్ లో కూడా బాగానే పాల్గొన్నది. ఈ సినిమా పైన బస్ క్రియేట్ అవ్వడానికి కూడా ఈమె పాత్ర చాలా కీలకంగా ఉన్నప్పటికీ ఇలా ఓటీటిలో ఈమె సన్నివేశాలు తీసేసారని వార్తలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. మరి డాకు మహారాజ్ చిత్రంలో ఊర్వశి పాత్ర ఉన్నాయా లేవా అనే విషయం ఓటీటిలో వచ్చేవరకు చెప్పడం కష్టం. బాలయ్య తదుపరి చిత్ర విషయానికి వస్తే బోయపాటి శ్రీను తో అఖండ 2 చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రం కూడా ఈ ఏడాది రిలీజ్ కాబోతోందట.