మెగా అభిమానులకి చరణ్ ఊహించిన షాక్..ఆ బిగ్ బడా ప్రాజెక్టు నుంచి అవుట్..!?

frame మెగా అభిమానులకి చరణ్ ఊహించిన షాక్..ఆ బిగ్ బడా ప్రాజెక్టు నుంచి అవుట్..!?

Thota Jaya Madhuri
"రామ్ చరణ్ "..ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా బాగా ట్రోల్లింగ్  కి గురైన పేరు.  రామ్ చరణ్ అంటే ఒక పాన్ ఇండియా హీరో.. ఒక స్టార్ హీరో.. ఒక మెగా హీరో .. ఒక గ్లోబల్ హీరో . ఇలాగే మాట్లాడుకునే వాళ్ళు జనాలు . అయితే ఎప్పుడైతే ఆయన నటించిన "గేమ్ చేంజర్" సినిమా రిలీజ్ అయ్యి ఫ్లాప్ టాక్ దక్కించుకుందో ..దారుణంగా కలెక్షన్స్ పడిపోయాయో.. అసలు ఈ  సినిమాకి వచ్చిన కలెక్షన్స్ అన్ని ఫేక్ అంటూ బయటపడ్డాయో అప్పటినుంచి రామ్ చరణ్ పేరు సోషల్ మీడియాలో బాగా నెగిటివ్ గా ట్రోల్ అవుతుంది.

మరి ముఖ్యంగా ఆ ఇంపాక్ట్ రాంచరణ్ నెక్స్ట్ నటిస్తున్న సినిమాలపై ఎక్కువగా పడింది.  ప్రెసెంట్ రాంచరణ్ "ఉప్పెన" మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు సనా తో ఒక సినిమాని ఓకే చేశాడు . ప్రజెంట్ ఈ సినిమా సెట్స్ పై ఉంది . ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీదేవి లవబుల్ డాటర్ అందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్ నటిస్తుంది . అయితే ఈ సినిమా తర్వాత బాలీవుడ్ బడా దర్శకుడు డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కే మైథాలజికల్ సినిమాకి రాంచరణ్ గ్రీస్ ఇచ్చిన ఇచ్చాడు అంటూ ఓ న్యూస్ వినిపించింది.

దానికి సంబంధించి అగ్రిమెంట్ పేపర్లపై కూడా సైన్ చేసే విధంగానే మాట్లాడుకున్నాడు రామ్ చరణ్ అంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే లాస్ట్ లో ఏమనుకున్నాడో ఏమో ఈ కథ నుంచి రామ్ చరణ్ ని తప్పిస్తూ టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ను చూస్ చేసుకున్నారు అంటూ టాక్ వినిపిస్తుంది . నిఖిల్ నాగేష్ తో  రామ్ చరణ్ ఒక పురాణ గాదపై ఆధారిత చిత్రంలో నటించడానికి రెడీగా ఉన్నాడు అంటూ వార్తలు వినిపించాయి . ఈ మూవీ ఆల్ మోస్ట్ ఫైఅన్ల్ అయిన్నట్లే అంటూ టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు ఆ స్థానంలోకి రౌడీ హీరో విజయ్ దేవరకొండ వచ్చినట్టు తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు రామ్ చరణ్ పేరు మరొకసారి హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిపోతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: