
నా కళ నెరవేరింది.. కానీ ఏంటో అడగొద్దు..మెగా డాటర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
ఇక ఈమె వెబ్ సిరీస్ లో బాగా కనిపిస్తుంది. వరుస సినిమాలతో ఫుల్ బీజీగా ఉంటుంది. ఇక ఈమె నిర్మాతగా కమిటీ కుర్రోళ్లు సినిమా తెరకెక్కించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇదిలా ఉండగా తాజాగా నిహారిక సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ లో 'నేను చాలా సంతోషంగా ఉన్నాను. అనుకొనిది జరగబోతుంది. మ్యాటర్ ఏంటి అని మాత్రం అసలు అడగాకండి. నాతో పాటుగా వైబ్ అవ్వండి, చిల్ అవ్వండి. నా కల చివరికి నెరవేరబోతుంది. నా యాక్టింగ్ కెరీర్ లో ఇదొక మైలు రాయి అవుతుంది. నేను గాలిలో తెలిపోతున్నాను' అని రాసుకొచ్చింది.
ఇక ఈ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. దీంతో అందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పోస్ట్ చూసిన వారందరూ.. నిహారికకి సినిమాలో ఏదైనా క్రేజీ ఆఫర్ వచ్చిందా, లేక ఏదైనా భారీ బడ్జెట్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. లేకపోతే చిరంజీవి సినిమాలో నాటిస్తుందా. వేరే భాషలలో నాటిస్తుందా అని చర్చలు జరుగుతున్నాయి. ఇక కారణం ఏమై ఉంటుందో తెలియాలంటే వేచి ఉండాల్సిందే. ఇకపోతే ఈమె ఢీ జూనియర్స్ అనే డ్యాన్స్ రియాలిటీ షోలకు యాంకర్ గా వ్యవహరించింది. నిహారిక జూన్ 2016లో విడుదలైన ఒక మనసు అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా నటిగా తెరంగేట్రం చేసింది.