
ఏజ్ బార్ హీరోతో ఐటెం సాంగ్ చేయనున్న త్రిష?
ముఖ్యంగా త్రిష తెలుగు, కన్నడ, తమిళ భాషలలో ఎన్నో సినిమాలలో నటించి భారీగా అవార్డులను సొంతం చేసుకుంది. ఈ బ్యూటీ వయసు 41 సంవత్సరాలు అయినప్పటికీ ఇంతవరకు వివాహం చేసుకోలేదు. కొంతమంది హీరోలతో ప్రేమలో ఉన్నట్లు అనేక రకాల వార్తలు వచ్చాయి. అంతేకాకుండా కొంతమందితో ఎఫైర్లు కూడా కొనసాగిస్తున్నట్లుగా ఎన్నో రకాల రూమర్స్ వచ్చాయి. అయితే వారిలో త్రిష ఎవరిని వివాహం చేసుకోకపోగా ఇంత వయసు వచ్చినా కూడా సింగిల్ గానే ఉంది.
ఇదిలా ఉండగా.... కొద్ది రోజుల నుంచి త్రిష తెలుగులో మళ్లీ సినిమాలు చేసుకుంటూ పోతోంది. వయసు పెరిగినప్పటికీ తన అందం ఏమాత్రం తగ్గలేదు. ఇదిలా ఉండగా... త్రిష తన కెరీర్లో ఎన్నో సినిమాలలో నటించినప్పటికి ఒక్కసారి కూడా ఐటెమ్ సాంగ్స్ లో చేయలేదు. రీసెంట్ గా విజయ్ దళపతి చేసిన దిగోట్ సినిమాలో మాత్రమే ఐటమ్ సాంగ్ చేసింది.
ఆ పాటలో చేసినందుకు త్రిషకు నెగిటివ్ గా కామెంట్లు వచ్చాయి. అయినప్పటికీ త్రిష ఏ మాత్రం ఆపకుండా మరో సినిమాలోనూ ఐటమ్ సాంగ్ లో నటించడానికి ఓకే చెప్పిందట. అనిల్ - చిరంజీవి కాంబినేషన్ లో రాబోయే సినిమాలో త్రిష స్పెషల్ సాంగ్ చేయనుందట. ఈ విషయం తెలిసి కొంతమంది అభిమానులు పలు రకాలుగా స్పందిస్తున్నారు.