
పద్దతైన పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ "నిత్యా మేనన్ "...!!
ఈ భామ టాలెంట్ కి టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.. గ్లామర్ రోల్స్ కి దూరంగా వుంటూ పెర్ఫార్మన్స్ బేస్డ్ పాత్రలతో నిత్యా మేనన్ అద్భుతంగా రాణించారు.. టాలీవుడ్ స్టార్ హీరోస్ పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ సినిమాలలో కూడా ఈ భామ నటించి మెప్పించింది.2011 లో సిద్దార్థ్ హీరోగా వచ్చిన “ నూట్రేన్ బంధు” సినిమాతో ఈ భామ తమిళ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.. తన టాలెంట్ తో అక్కడి ప్రేక్షకులని సైతం ఆకట్టుకుంది..
విజయ్ దళపతి, ధనుష్ వంటి స్టార్ యాక్టర్స్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.. రీసెంట్ గా ఉత్తమ నటిగా అవార్డ్ కూడా అందుకుని నిత్యా మేనన్ చరిత్ర సృష్టించింది.. ప్రస్తుతం వస్తున్న హీరోయిన్స్ స్టార్ హీరోల సరసన ఛాన్సుల కోసం గ్లామర్ ఓలకబోస్తుంటే నిత్యా మేనన్ మాత్రం పెర్ఫార్మన్స్ రోల్స్ తో దూసుకుపోతుంది..