ధూమ్ 4 : బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సిరీస్ లో గ్లోబల్ స్టార్..?
మొదటి సినిమాలో జాన్ అబ్రహం దొంగ క్యారక్టర్ చెయ్యగా, అభిషేక్ బచ్చన్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించాడు. ఇక రెండవ సినిమాలో మళ్ళీ అభిషేక్ బచ్చన్ పోలీస్ పాత్ర పోషించగా, హృతిక్ రోషన్ దొంగ పాత్ర చేసాడు.అయితే ముందు సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ క్యారక్టర్ ని అభిషేక్ బచ్చన్ చేయగా, అతని అసిస్టెంట్ క్యారక్టర్ ని ఉదయ్ చోప్రా చేసాడు. కానీ ఈసారి ఆ పోలీస్ ఆఫీసర్ క్యారక్టర్ లో వరుణ్ ధావన్, అలాగే ఉదయ్ చోప్రా క్యారక్టర్ లో కార్తీక్ ఆర్యన్ కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో తెలుగు నటీనటులకు స్కోప్ తక్కువే. ఇది ఫక్తు బాలీవుడ్ సినిమాగా తెరకెక్కబోతుందట.ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చి బాబు తో రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ ని చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన సుకుమార్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని కూడా మొదలుపెట్టాడు సుకుమార్. ఈ చిత్రం తర్వాత సందీప్ వంగ, ప్రశాంత్ నీల్, లోకేష్ కనకరాజ్ వంటి టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లైన్ లో ఉన్నారు. మరి ధూమ్ 4 కి రామ్ చరణ్ డేట్స్ ఎలా సర్దుబాటు చేస్తాడు అనేది చూడాలి.
మరింత సమాచారం తెలుసుకోండి:
-
John Abraham
-
Uday Chopra
-
Dhoom
-
prasanth
-
sukumar
-
Japan
-
Pawan Kalyan
-
Yash
-
RRR Movie
-
RRR
-
Lokesh
-
Lokesh Kanagaraj
-
Prashant Kishor
-
varun sandesh
-
varun tej
-
Karthik
-
Abhishek Bachchan
-
CBN
-
Industry
-
sandeep
-
Father
-
Shahrukh Khan
-
Blockbuster hit
-
Hrithik Roshan
-
Traffic police
-
Ram Charan Teja
-
Telugu
-
Chitram
-
Indian
-
bollywood
-
Cinema