నాని ' ప్యారడైజ్ ' కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్..ఎవరో తెలుసా..?

frame నాని ' ప్యారడైజ్ ' కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్..ఎవరో తెలుసా..?

murali krishna
న్యాచురల్ స్టార్ నాని తనకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతోనే మరో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. నాని తొలి సినిమా ఆఫర్ ఇచ్చి మళ్లీ ఆ డైరెక్టర్ రెండో ఆఫర్ కూడా ఇవ్వడం అంటే అది కచ్చితంగా స్పెషల్ థింగ్ అని చెప్పొచ్చు. నాని డైరెక్టర్స్ ని పరిచయం చేస్తాడు ఆ తర్వాత మరో సినిమా చేయాలన్నా సరే కుదరదు. ఐతే ఆల్రెడీ సినిమా చేసిన అనుభవం ఉన్న వివేక్ ఆత్రేయతోనే నాని రెండు సినిమాలు చేశాడు. ఇక ఇంద్రగంటి మోహనకృష్ణ లెక్క వేరే. నానిని హీరోగా ఇంట్రడ్యూస్ చేసింది ఆయన కాబట్టి నాని కాదనలేడు.ఇదిలా ఉంటే శ్రీకాంత్ ఓదెలతో నాని రెండో సినిమా చేయడం పట్ల సర్వత్రా ఆసక్తిగా ఉంది. దసరా తర్వాత ఈ కాంబో మళ్లీ కలిసి పనిచేయడం అనేది నాని ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అని చెప్పొచ్చు. ఐతే ఈసారి ఈ ఇద్దరు కలిసి ముందు సినిమా కన్నా పెద్దగా అంటే దసరాని మించిన సినిమా చేస్తున్నారని తెలుస్తుంది. నాని శ్రీకాంత్ ఓదెల రెండో సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో రాబోతుందని టాక్.
ఐతే ఈ సినిమాకు చిత్ర యూనిట్ పారడైస్ అనే టైటిల్ అనుకోగా అది కాస్త లీక్ అయ్యింది.

నాని పారడైస్ సినిమా విషయంలో ప్లానింగ్ చాలా పెద్దగా ఉందని టాక్. ముఖ్యంగా ఈ సినిమా గురించి వచ్చిన లేటెస్ట్ లీక్ సినిమాను రెండు భాగాలుగా చేస్తున్నారట. 
నాని సినిమా రెండు భాగాలా అని ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఈమధ్య కాన్సెప్ట్ బాగున్న సినిమాలన్నీ కూడా కొనసాగించేందుకు ఏమాత్రం ఆలోచించట్లేదు. ఇదిలావుండగా తాజాగా మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ముందునుంచి ప్రచారం సాగుతున్నట్లుగానే ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మేరకు మ్యూజిక్ డైరెక్టర్ను ఫిక్స్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.ఇక మూవీ మేకర్స్ ఈ విషయాన్నీ తెలియజేస్తూ ఇప్పుడు అధికారికంగా అనిరుథ్ ను సోషల్ మీడియా లో ఫాలో అవుతున్నాం. ఇక తగలబెట్టేద్దాం అని పోస్ట్ చేసింది. ఇదిలావుండగా ఫీమేల్ లీడ్ కోసం కూడా మేకర్స్ భారీ స్థాయిలోనే ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ను ఎంపికచేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్లు జాన్వీ కపూర్, శ్రద్ధా కపూర్ను మేకర్స్ సంప్రదించినట్లు టాక్ నడుస్తోంది. ఎస్‌ ఎల్ వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాని కెరీర్లో ఇది అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా రూపొందనుందని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: