విశ్వంభర కోసం రంగంలోకి 'కల్కి' డైరెక్టర్..?

frame విశ్వంభర కోసం రంగంలోకి 'కల్కి' డైరెక్టర్..?

murali krishna
మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా చాలా కాలం తర్వాత కలిసి నటిస్తున్న భారీ చిత్రమే “విశ్వంభర”. మరి యువ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ విజువల్ ట్రీట్ కోసం మెగా అభిమానులు ఎపుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాకి విజువల్స్ చాలా కీలకమని తెలిసిందే.విఎఫ్ఎక్స్ పరంగా చాలా పని ఉంది.ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాను తొలుత సంక్రాంతి 2025 కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కానీ 'గేమ్ ఛేంజర్' రిలీజ్ కోసం ఈ మూవీ రిలీజ్ డేట్‌ను వాయి దా వేశారు.  అయితే టీజర్ వచ్చాక సినిమాని ఇంకా ఇంప్రూవ్ చెయ్యాలని కామెంట్స్ కూడా వచ్చాయి. దీనితో మేకర్స్ కి మళ్లీ పని పడింది.అదేమిటంటే  ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ వార్త ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేయడంతోపాటు ఫ్యాన్స్ ని కొంత అయోమయానికి గురి చేస్తుంది. వశిష్ట దర్శకుడు కాగా, మూవీలో ఇతర దర్శకులు ఇన్‌వాల్వ్ అవుతున్నారనే వార్త ఆశ్చర్యపరుస్తుంది. గతంలో మాస్‌ డైరెక్టర్ వివి వినాయక్ ఇన్‌వాల్వ్ అవుతున్నారంటూ వార్తలు వచ్చాయి.
ఆయన వీఎఫ్‌ఎక్స్ వర్క్ చూస్తున్నారనే విషయం బయటకు వచ్చింది. బింబిసార వంటి సినిమాని తీసిన వశిష్ట ఉండగా, మరో దర్శకుడి ఇన్‌వాల్వ్ మెంట్‌ ఏంటనే అనుమానాలు కలిగాయి. ఔట్‌పుట్‌ బెటర్‌మెంట్‌ కోసం చిరంజీవి సలహా మేరకు వినాయక్‌ రంగంలోకి దిగినట్టు వార్తలు వచ్చాయి.ఇక ఇప్పుడు మరో దర్శకుడు ఇన్‌వాల్వ్ అవుతున్నారట. మహానటి, కల్కి 2898 ఏడీ వంటి సినిమాలతో ఆడియెన్స్ ని మాయ చేసిన నాగ్‌ అశ్విన్‌ ఈ మూవీలో ఇన్‌వాల్వ్ అవుతున్నారట. ఆయన వీఎఫ్‌ఎక్స్ వర్క్ చూస్తున్నారట. సీజీ వర్క్ క్వాలిటీ విషయంలో చిరు తగ్గడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆడియెన్స్ అన్నీ గమనిస్తున్నారు. వరల్డ్ క్లాస్‌ మూవీస్‌ని చూస్తున్నారు.ఈ క్రమంలో నాసిరకమైన సీజీ ఉంటే అది విమర్శలకు తావిస్తుంది. సినిమా ఫలితాన్నే ప్రభావితం చేస్తుంది. దారుణమైన ట్రోల్ జరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి చాలా కేర్‌ తీసుకుంటున్నారట. అందుకే నాగ్‌ అశ్విన్‌ని రంగంలోకి దించినట్టు సమాచారం. ఆయన వీఎఫ్‌ఎక్స్ పర్యవేక్షిస్తున్నారని వార్తలు బయటకు వచ్చాయి.అయితే ఇందులో నిజమెంతా అనేది సస్పెన్స్. అందుకే రిలీజ్‌ డేట్ ని కూడా ఇంకా కన్ఫమ్‌ చేయలేదు టీమ్. సమ్మర్‌ టార్గెట్‌గా మే 9న విడుదల చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: