రీ రిలీజ్ కి రెడీ అయిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. ఎప్పుడో తెలుసా..?

frame రీ రిలీజ్ కి రెడీ అయిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. ఎప్పుడో తెలుసా..?

Pulgam Srinivas
విక్టరీ వెంకటేష్ , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోలుగా అంజలి , సమంత హీరోయిన్లుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించగా ... మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. రావు రమేష్ , ప్రకాష్ రాజ్ ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు. ఇకపోతే 2013 వ సంవత్సరం సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 11 వ తేదీన భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.


ఈ సినిమా కంటే ముందు తెలుగు సినిమా పరిశ్రమలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసిన నటించిన సినిమా విడుదల అయ్యి చాలా కాలం కావడంతో ఈ మూవీ పై మొదటి నుండి ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకొవడంతో ఫుల్ గా సక్సెస్ కావడంతో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలక్షన్లను రాబట్టింది. ఇకపోతే 2013 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ చేయబోతున్నారు.


తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ మూవీ ని మరికొన్ని రోజుల్లోనే థియేటర్స్ లో రీ రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. మరి ఈ సినిమాను ఏ తేదీన రీ రిలీస్ చేస్తారు అనే విషయం గురించి మేకర్స్ మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: