సినీ ఇండస్ట్రీలో ఏ ప్రొఫెషన్‌లో అయినా అడుగుపెట్టి సక్సెస్ సాధించాలంటే అది చాలా కష్టతరమైనపని. అలాంటిది ఇండస్ట్రీలో దర్శకులుగా అడుగుపెట్టి సక్సెస్ సాధించడం మరింత కష్టం.ఇక ఓ సినిమా తెరకెక్కించి సినిమా సక్సెస్ సాధించిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో ఆ సినిమాలపై నెగటివ్ కామెంట్స్ వినపడుతూ ఉంటాయి. మరికొన్ని సందర్భాల్లో పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తాయి. కానీ కొన్ని సినిమాలకు ఓ పక్కన పాజిటివ్ కామెంట్లతో పాటు నెగిటివ్ కామెంట్స్ కూడా వెళ్లడవుతు ఉంటాయి. అలాంటి సినిమాలను తెరకెక్కించే దర్శకులు టాలీవుడ్ లో చాలా రేర్ గా ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో సందీప్ రెడ్డి వంగ ఒకడు. ఆయన తెరకెక్కించిన అతి తక్కువ సినిమాలతోనే స్టార్ హీరోగా ఇండియా లెవెల్‌లో తిరుగులేని ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు సందీప్.తన డైరెక్షన్లో తెరకెక్కిన మొదటి మూవీ అర్జున్ రెడ్డి ఇప్పటికీ ఈ సినిమా గురించి జనాలు మాట్లాడుకుంటున్నారంటే ఆ సినిమా ఏ రేంజ్లో జనాలపై ఇంఫ్యాక్ట్ చూపించిందో అర్థం చేసుకోవచ్చు. విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఎప్పుడూ మర్చిపోలేని రేంజ్‌లో అర్జున్ రెడ్డి సీన్స్ ను సందీప్ రెడ్డి తెరకెక్కించాడు. ఇక.. యానిమల్ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే.
మొదటి సినిమాలో రష్మిక క్యారెక్టర్ ను బూతులు తిట్టిన జనాలే.. రష్మిక నటన బాగుందంటూ తర్వాత ప్రశంసలు కురిపించారు.
అంతలా సందీప్ రెడ్డి వంగ జనాల పల్స్ పట్టి సినిమాల రూపొందిస్తాడు. అయితే త్వరలోనే సందీప్ రెడ్డి .. ప్రభాస్‌తో స్పిరిట్ సినిమాను రూపొందించనున్నాడు. ఇక ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగ.. ప్రభాస్ కోసం చేసిన మాస్టర్ ప్లాన్ అదిరిపోయింది అంటూ ఓ అప్డేట్ వైరల్ గా మారుతుంది.అదేమిటంటే ప్రభాస్ తో సందీప్ రెడ్డి ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటింపజేస్తున్నారు. ఇక దాంతోపాటుగా ఈ సినిమా క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఇక ఇప్పటివరకు మనం పోకిరి సినిమాలోని ట్విస్ట్ ను హైలెట్ గా చేసి చెప్తున్నారు కదా ఇకమీదట నుంచి స్పిరిట్ సినిమా ట్విస్ట్ హైలెట్ గా నిలవబోతోంది అంటూ మేకర్స్ నుంచి కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ప్రభాస్ ని యాక్షన్ ఎపిసోడ్స్ లో భారీ రేంజ్ లో చూపించాలనే ప్రయత్నం చేస్తున్న సందీప్ రెడ్డి వంగ తను తదుపరి సినిమాతో ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.