
మిల్కీ బ్యూటీ మొదటి పారితోషకం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?
అయితే ఆ సినిమా కంటే ముందుగానే తమన్నా ఓ కమర్షియల్ యాడ్ లో నటించింది..పగలు అంతా 10 వ తరగతి ఎగ్జామ్స్ రాసి.. మధ్యాహ్నం కనీసం పార్లర్ కూడా వెళ్లకుండా తమన్నా 2 నుంచి 10 గంటల వరకు దాదాపు మూడు రోజుల పాటు ఆ కమర్షియల్ యాడ్ చేసిందట.2005లో జరిగిన ఈ యాడ్ కోసం మూడు రోజులకు గాను తమన్నా లక్ష రూపాయల పారితోషికం అందుకుందని సమాచారం..తనకి వచ్చిన ఆ లక్షరూపాయలు తన ఫ్యామిలీతోనే ఖర్చు చేసినట్లు గతంలో తమన్నా తెలిపింది.
తెలుగులో తమన్నా హ్యాపీడేస్ సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది..ఆ తరువాత తమన్నా తెలుగులో వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది..ప్రస్తుతం తమన్నా వరుస సినిమాలలో నటిస్తూనే ఐటమ్ సాంగ్స్ ఓ ఊపు ఊపేస్తుంది.. ఈ భామ ఇటీవల స్త్రీ 2 లో చేసిన ఐటమ్ సాంగ్ ఎంతో పాపులర్ అయింది.. వయసు పెరుగుతున్న తన అందంలో ఏ మాత్రం మార్పు లేకపోవడంతో తమన్నా తన జోరు ఇంకా కొనసాగిస్తుంది.. ప్రస్తుతం తమన్నా పారితోషకం 4 నుంచి 5 కోట్లు ఉన్నట్లు సమాచారం..