టాలీవుడ్ యువ నటులలో రామ్ పోతినేని ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి అందులో చాలా సినిమాలతో మంచి విజయాలను అందుకుని టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇకపోతే తాజాగా రామ్ పోతినేని "డబల్ ఈస్మార్ట్" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఈస్మార్ట్ శంకర్ మూవీ కి కొనసాగింపుగా రూపొందింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కావ్య ధాపర్ హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.
ఇకపోతే తాజాగా ఈ సినిమా ఒక అద్భుతమైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన హిందీ ప్రేక్షకులను మాత్రం అద్భుతంగా ఆకట్టుకుంది. ఈ మూవీ హిందీ వెర్షన్ కి యూట్యూబ్ లో ఏకంగా 100 ప్లస్ మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇకపోతే కేవలం రామ్ పోతినేని హీరోగా రూపొందిన ఈ ఒక్క సినిమాకు మాత్రమే కాదు ఆయన నటించిన ఏకంగా పది సినిమాలకు హిందీ లో 100 ప్లస్ మిలియన్ వ్యూస్ వచ్చాయి. రామ్ పోతినేని హీరోగా రూపొందిన డబుల్ ఇస్మార్ట్ , స్కంద , ది వారియర్ , హలో గురు ప్రేమ కోసమే , వున్నది ఒకటే జిందగీ , నేను శైలజా , పండగ చేస్కో , ఈస్మార్ట్ శంకర్ , గణేష్ , హైపర్ సినిమాలకు కూడా 100 ప్లస్ మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయి.
ఇందులో కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టినవి కూడా ఉన్నాయి. ఇలా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిన సినిమాలు కూడా యూట్యూబ్ లో మాత్రం హిందీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇలా రామ్ తన డబ్బింగ్ సినిమాలతో హిందీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాడు.