నాకు కావాలంటే.. నాన్న రాత్రికి రాత్రే సెట్ చేస్తారు.. నాగచైతన్య కామెంట్స్ వైరల్?
సదరు ఇంటర్వ్యూ చేసిన యాంకర్, నాగ చైతన్యను ఉద్దేశించి... 'ఇపుడు అందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ పోతున్నారు. బడా డైరెక్టర్స్, బడా కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. మరి మీ సంగతేంటి?' అని అడగగా... ప్రస్తుతం తమ కెరీర్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నానని, తనకు వచ్చిన సినిమాలను తాను చేసుకుంటూ వెళ్తున్నానని చెప్పుకొచ్చాడు. ఇక క్రేజీ కాంబినేషన్స్, స్టార్ డైరెక్టర్స్ సెట్ చేయడం పెద్ద కష్టమేమి కాదు కానీ, నాన్న ఎప్పుడు కూడా తమ దగ్గర ఈ క్రేజీ కాంబినేషన్స్ గురించి మాట్లాడరని... ఇష్టమైన సినిమాలు చేస్తూ పోవాలని చెబుతూ ఉంటాడని చెప్పుకొచ్చాడు. ఒకవేళ మేము ఫలానా డైరెక్టర్ కావాలని అడిగితే నాన్న క్షణాల్లో సెట్ చేస్తాడని, కానీ అంత అవసరం లేదంటూ వ్యాఖ్యానించాడు నాగ చైతన్య.
కాగా ఆ వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే నాగ చైతన్య తండేల్ సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాలో సాయి పల్లవి నటించడం కూడా ఒక అసెట్ అయ్యేలా ఉంది. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన 3 సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ కాగా, సినిమా నుండి రిలీజైన తాజా ట్రైలర్ కూడా అభిమానులకు తెగ నచ్చేసింది. దాంతో ఈసారి నాగ చైతన్య గురి తప్పదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చందు మొండేటి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగినట్టు తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించడంతో సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది.