మెగాస్టార్ చిరంజీవి, త్రిష కాంబినేషన్‌లో వస్తున్న విశ్వంభర సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందకు రాబోతుంది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ మూవీ గేమ్‌ఛేంజర్ రేసులో ఉండటంతో వాయిదా వేశారు. అలాగే విశ్వంభర గ్రాఫిక్స్ వర్క్ కూడా కొంత పెండింగ్‌లో ఉండటం, ఇటీవల రిలీజ్ అయిన గ్లింప్స్‌పై ఫ్యాన్స్ పెదవి విరవడంతో కాస్త టైమ్ తీసుకుని అయినా సరే మంచి విజువల్స్ ఎఫెక్స్ట్‌తో తీర్చిదిద్దుతున్నారు.మే 9న విశ్వంభర మూవీని రిలీజ్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం విశ్వంభర మూవీ షూట్ కంప్లీట్ అయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుంది.సుమారు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.ఇదిలావుండగా విశ్వంభర సినిమాకు ‘జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా కనెక్షన్ ఉంటుంది అని గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న సమాచారం.ఈ విషయంలో విశ్వంభర మూవీ టీమ్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు కానీ వైజయంతి మూవీస్ అయితే జగదేక వీరుడు రైట్స్ మా దగ్గరే ఉన్నాయి అంటూ మీనింగ్ ఉండేలా ఓ పోస్ట్ పెట్టింది. ఆ విషయమే ఇంకా అంతు చిక్కడంలేదు.
ఇదిలావుంటే ఇప్పుడు తాజాగా మరో సినిమాతో ఈ సినిమాకు సంబంధం ఉంది అంటూ వార్తలొస్తున్నాయి.ఈ క్రమంలో ఇప్పుడు ఈ విషయాన్నీ ఇంతగా చర్చించుకోవడానికి కారణం విశ్వంబర మూవీ దర్శకుడు మల్లిడి వశిష్ఠ తన సోషల్ మీడియా లో పెట్టిన ఓ పోస్ట్. ఆదివారం సాయంత్రం వశిష్ట ఓ వీడియోను తన ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ఆ వీడియో చిరంజీవి కల్ట్ మాస్ మూవీ ఖైదీ లోనిది. ఇప్పటికే మీ అందరికి అర్ధమయ్యే ఉంటుంది ఆ సీన్ ఏమిటి అనేది.ఖైదీ మూవీ లో కొండపల్లి ఊరు బోర్డు ముందు చిరంజీవి నిలబడి ఎటు వెళ్లాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అదే ఆ సీన్. ఆ సీన్‌లో ఉండే ఎలివేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఎందుకంటే ఆ సీన్ అలావుంటుంది మరి.ఇప్పుడు ఆ సీన్‌ను వశిష్ఠ ఎందుకు పోస్ట్ చేశారో తెలియదు కానీ, దాని పై సోషల్ మీడియా లో రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి.విశ్వంభర సినిమాకు దీనికీ సంబంధం పెట్టేస్తున్నారు ఔత్సాహిక అభిమానులు. అలాంటి సీన్ ఈ సినిమాలోనూ ఉంటుందని కొందరు సానుకూలంగా అంటుంటే ఆ సీన్ రిఫరెన్స్ ఈ సినిమాలో రాసుకున్నారేమో అని మరికొందరు అంటున్నారు. ఇంకొందరు అయితే ‘విశ్వంభర’ కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నారు యాక్షన్ ఎపిసోడ్‌తో అని ఊహిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆ వీడియో ఎందుకు పోస్టు చేశారో వశిష్ఠనే చెప్పాలి. మరోవైపు సినిమా టీజర్‌కు వచ్చిన నెగిటివిటీని దృష్టిలో పెట్టుకుని విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో చాలా మార్పులు చేయాలని కూడా టీమ్ ఫిక్స్ అయిందట. చూడాలి మరి దీని పై మూవీ ఎలా స్పందిస్తుందో.