
పటాస్ ను అనిల్ రావిపూడి అంత తక్కువ బడ్జెట్ తో తీశాడా? ఎన్నికోట్లంటే?
అయితే అనిల్ రావిపూడి, టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్ తో పదేళ్ల కిందట పటాస్ మూవీ తెరకెక్కించారు. ఈ సినిమాతోనే అనిల్ రావిపూడి డైరెక్టర్ గా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. పటాస్ సినిమాతో తన దర్శకత్వ జీవితాన్ని ప్రారంభించిన అనిల్ ఎన్నో మంచి మంచి సినిమాలు చేసి.. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం మూవీతో మరోసారి హిట్ కొట్టాడు.
పదేళ్లుగా సినీ రంగంలో వరుస హిట్ లతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి.. తన మొదటి సినిమా పటాస్ ని ఎంత బడ్జెట్ పెట్టి తీశాడో తెలుసా. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హిట్ కొట్టిన ఆయన మాట్లాడుతూ.. 'నేను పటాస్ మూవీని అప్పుడున్న పరిస్థితుల్లో నాకు ఇచ్చిన నాలుగైదు కోట్ల బడ్జెట్‌లో అద్భుతంగా తీశాను. కానీ అది ముప్పై కోట్ల ప్రాజెక్ట్ లా తీశానని చాలా మంది అన్నారు. ఎన్ని సినిమాలు హిట్ కొట్టిన కూడా నాకు, నేను తీసిన మొదటి సినిమా పటాస్ అంటే ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. మళ్లీ అవకాశం వస్తే మరోసారి.. నేను పటాస్ హీరో కళ్యాణ్ రామ్ తో మళ్లీ ఇంకో సినిమా తీస్తాను' అని డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు.