
గేమ్ ఛేంజర్ కి మైనస్ అదేనా.. ఇండస్ట్రీకి హెచ్చరిక..!
ముఖ్యంగా గేమ్ ఛేంజర్ సినిమా ఫ్లాప్ కావడానికి సోషల్ మీడియాలో కావాలని కొంతమంది దుష్ప్రచారం చేశారనే విధంగా అభిమానులు భావిస్తున్నారు.. అందుకు తగ్గట్టుగా ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ కూడా ఒక సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా సోషల్ మీడియా,నెగిటివ్ రివ్యూస్ సినిమాల పైన తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయని తెలిపారు. ఏదైనా రాజకీయపరంగా ఉంటే మీరు మీరు చూసుకోండి సినిమాని చంపకండి అంటూ తెలుపుకొచ్చారు. నెగిటివిటీ వల్ల నిర్మాతలు బాధ పెట్టవద్దండి అంటూ తెలిపారు. తమన్ వ్యాఖ్యలకు చిరంజీవ మద్దతు కూడా చేయడం జరిగింది.
గేమ్ ఛేంజర్ పరాజయం వెనక వంద కారణాలు కనిపిస్తున్నాయి..మొదట ఈ సినిమా పైన అల్లు అర్జున్ అభిమానులు ఆగ్రహం..పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత పైరసీ ద్వార బయటికి వచ్చినప్పటికీ.. కథలో దమ్ము ఉండడం చేత అన్ని భాషలలో కలిపి 2000 కోట్ల రూపాయల వరకు రాబట్టాయి. కానీ గేమ్ ఛేంజర్ కు ఆ స్థాయిలో కంటెంట్ లేకపోవడం మైనస్. ముఖ్యంగా పైరసీ కుట్ర ఒకటి. షో ముగిసిన గంటలోనే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రసారమయ్యింది..సోషల్ మీడియాలో ఫ్లాప్ టాక్ రావడంతో నెగటివ్ ప్రచారం చేయడంతో వెళ్లాలనుకునే వారు కూడా వెళ్లలేక పోయారు.
అయితే అల్లు అర్జున్ అభిమానులు..కూడా కొంతమేరకు నెగిటివ్ స్ప్రెడ్ చేశారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. rrr చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర తక్కువ చూపించి రామ్ చరణ్ పాత్ర ఎక్కువగా చూపించడంతో ఫ్యాన్స్ ఫైర్ అయ్యారట.. దీంతో రామ్ చరణ్ సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూడలేదని టాక్ వినిపిస్తోంది. ఏపీలో పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్ తర్వాత ఎవరూ కూడా గేమ్ ఛేంజర్ పబ్లిసిటీ కోసం ముందుకు రాలేదట.ఇది మైనస్ గా మారింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ రాజకీయాలు మాట్లాడడంతో ఇతర పార్టీలలో ఉండే చరణ్ ఫాన్స్ కూడా దూరమయ్యారు.
మొత్తానికి..సంక్రాంతికి వస్తున్న సినిమాకి ప్రమోషన్స్ చేయడంతో మంచి హైప్ ఏర్పడింది.. గేమ్ ఛేంజర్ చిత్రానికి తక్కువ ప్రమోషన్ చేయడంతో మైనస్ గా మారిందట. రామ్ చరణ్ సినిమాతో ఫ్లాప్ అయిన సంక్రాంతి సినిమాతో సేవ్ అయ్యారు దిల్ రాజు. మొత్తానికి ఏది ఏమైనా సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ చేయకపోయినా, సోషల్ మీడియా వల్ల నెగెటివ్ టాక్ వచ్చిన ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు.. ఇలా అయితే ఇండస్ట్రీ దెబ్బతింటుందని రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పవచ్చు.