టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రం రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ముఖ్యంగా అనిల్ రావిపూడి ఇలాంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు బాగా తీస్తారు. అందులోనూ ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహ పడానివ్వడు. తనదైన శైలిలో సినిమాలు తీస్తూ అనిల్ రావిపూడి ఫ్యామిలీ డైరెక్టర్ గా నిలిచారు. గ్రాండ్ రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో హీరోయిన్లు గా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు భీమ్స్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. 18 ఏళ్ల తర్వాత విక్టరీ వెంకటేష్, రమణ గోగుల కాంబో మళ్లీ వచ్చిన సినిమా ఇది. బ్లాక్‌బస్టర్ లక్ష్మి కోసం వెంకటేష్‌తో కలిసి పని చేసిన రమణ గోగుల ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ సింగిల్‌కి తన వాయిస్ ని అందించారు.
ఇక ఇటీవల వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మరో బ్లాక్ బస్టర్ గా నిలవనుంది. ఈ సందర్భంగా అనిల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఓ ఈవెంట్ లో ఈ సినిమాలో నేను, మీనాక్షీ చేయకపోతే వేరే ఎవరిని తీసుకునేవారని ఐశ్వర్య రాజేష్, అనిల్ రావిపూడిని అడిగింది. దానికి అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఐశ్వర్య చేయకపోతే నిత్యామీనన్ ని, మీనాక్షి స్థానంలో పూజా హెగ్డేని హీరోయిన్లు గా తీసుకునే వాడ్ని అని సమాధానం ఇచ్చాడు. దాంతో ఆ పాత్రల్లో మమ్మల్ని తప్ప వేరే ఎవర్నీ ఊహించుకోలేను అని అంటారేమోనని ఎదురుచూశానని ఐశ్వర్య పంచ్ పేల్చేసింది. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇప్పుడు ప్రతి ఇంట్లో సందడి చేస్తుంది. అలాగే ఈ సంక్రాంతికి టాప్ 1 నిలిచింది.