తెలుగు సినిమా పరిశ్రమలో అపజయాలు లేకుండా విజయాలతో చాలా సంవత్సరాల పాటు దర్శకుడిగా కెరీర్ను కొనసాగిస్తున్న వారిలో అనిల్ రావిపూడి ఒకరు. ఈయన పటాస్ అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టి ఆ తర్వాత చాలా సినిమాలకు దర్శకత్వం వహించి ఆయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమాతో కూడా నిర్మాతలకు లాభాలు అందిస్తూ ఒక గొప్ప దర్శకుడిగా తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ అనిల్ రావిపూడి ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే తాజాగా అనిల్ రావిపూడి , వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను రూపొందించాడు.
ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేశారు. మొదటి నుండి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అలా భారీ అంచనాల నడుమ నిన్న విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ప్రస్తుతం ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను బాక్సా ఫీస్ దగ్గర రాబడుతుంది. ఇకపోతే అనిల్ రావిపూడి తన నెక్స్ట్ మూవీ ని మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన పలుమార్లు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.
దానితో అనిల్ రావిపూడి ప్రస్తుతం అద్భుతమైన విజయాలు అందుకుంటూ కెరియర్ను ముందుకు సాగిస్తూ ఉండడంతో మెగాస్టార్ అభిమానులంతా కూడా అనిల్ రావిపూడి తమ అభిమాన నటుడితో ఎలాంటి సినిమా చేస్తాడా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి అనిల్ రావిపూడి కామెడీ సినిమాలకు పెట్టింది పేరు. చిరంజీవి కూడా అద్భుతమైన కామెడీని పండిస్తూ ఉంటాడు. వీరిద్దరి కాంబోలో ఒక కామెడీ ఓరియంటెడ్ సినిమా వస్తే బాగుంటుంది అని అభిప్రాయాలను మెగా ఫ్యాన్స్ గట్టిగా వినిపిస్తున్నట్లు తెలుస్తుంది.