
చరణ్ - కాజల్ కాంబినేషన్‌లో మగధీర, గోవిందుడు తర్వాత మిస్ అయిన మూవీ టైటిల్ ఇదే..!
టాలీవుడ్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాతో తిరుగులేని క్రేజ్ వచ్చింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత సినిమాతో హీరోగా పరిచయమైన రామ్ చరణ్ .. మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఆ సినిమా చిన్న చిన్న పల్లెటూరులో కూడా 100 రోజులు ఆడి వసూళ్ళ పరంగా దుమ్ము దులిపేసింది. మగధీర వేసిన బలమైన పునాదితో రామ్ చరణ్ టాలీవుడ్‌లో తిరగలేని హీరో అయిపోయాడు. .
ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడిగా హీరోయిన్గా ఎవరిని తీసుకోవాలా అని ఎందరో హీరోయిన్ల పేర్లు పరిశీలించిన రాజమౌళి .. చివరకు కాజల్ పై ఫోటో షూట్ చేశాక ఆమె అయితేనే రాకుమారి పాత్రలో బాగా సూట్ అవుతారని .. . ఆమెను హీరోయిన్గా తీసుకున్నారు. సినిమాలో రామ్ చరణ్, కాజల్ జోడి .. కెమిస్ట్రీ తెరపై అదిరిపోయింది. మగధీర హిట్ అయ్యాక మళ్లీ రామ్‌చరణ్ , కాజల్ కాంబినేషన్‌లో మెరుపు అని మరో సినిమా కూడా పట్టాలెక్కింది. టైటిల్ తోనే ఒక్కసారిగా అందరి దృష్టిని ఆ సినిమా ఆకర్షించింది. .
పవన్ కళ్యాణ్‌తో బంగారం లాంటి సినిమా తెరకెక్కించిన తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వంలో అగ్ర నిర్మాత ఏ . ఎమ్ . రత్నం నిర్మాణ సారధ్యంలో మెరుపు సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకుంది. అయితే కథ సరిగా రాలేదన్న కారణంతో .. మెరుపు సినిమా రెండు షెడ్యూల్స్ షూటింగ్ అయ్యాక మధ్యలోనే ఆగిపోయింది. మరోసారి రామ్‌చరణ్, కాజల్ కలిసి కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన గోవిందుడు అందరివాడే సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ మార్కులు వేయించుకుంది..