అందరిముందే పైట తీసి పడుకోమన్నాడు.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌పై నటి సంచలన కామెంట్స్..!

RAMAKRISHNA S.S.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ జ్యోతి గురించి అందరికీ తెలిసిందే. కొన్ని సినిమాలలో వ్యాంప్ రోల్‌ చేసి బాగా పాపులర్ అయింది. సాధారణంగా మొహానికి మేకప్ వేసుకున్న తర్వాత మగవాళ్ళు అయితే ఎలాంటి క్యారెక్టర్ చేయడానికి అయినా ఓకే చెప్తారు. కొందరికి క్యారెక్టర్ ఆర్టిస్టులు పాత్ర నచ్చక సినిమాలు వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. చిరంజీవి చెప్పులు కుట్టే పాత్రలో, బాలయ్య కుష్టి వ్యాధి వచ్చిన పాత్రలో, కమలహాసన్ రకరకాల ప్రయోగాలు చేశారు. అందుకే ఈరోజు వాళ్ళు అంత పెద్ద స్టార్ హీరోలు అయ్యారు.


చెప్పాలంటే ఇప్పుడున్న సీనియర్ స్టార్ హీరోలు , యంగ్ హీరోలు సాధ్యమైనంత వరకు అన్ని సాహసాలకు సిద్ధమవుతున్నారు. కాబ‌ట్టే ఇప్పుడు మన తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. లేదంటే ఆ స్థాయిలో నిలబడి ఆస్కార్‌ అవార్డులు దక్కించుకోవడం అంత సులభం కాదు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి వారు బిచ్చగాళ్ళ పాత్రలలో మెప్పించారు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే రాశి .. రంగస్థలం సినిమాలో అనసూయ చేసిన పాత్ర చేయమంటే నో చెప్పింది. అలాగే 20 ఏళ్ల క్రితం టాలీవుడ్ లో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బాగా పాపులర్ అయింది జ్యోతి.


ప్రముఖ దర్శకుడు ఈవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఓ సినిమాలో ఓ క్యారెక్టర్ చేయడానికి నో చెప్పిందట. అందరూ ఉండగా సీన్ చెప్పకుండా వెళ్లి ప‌యట తీసి అక్కడ పడుకో అన్నారట. ఈవివి పెద్ద డైరెక్టర్ అని కూడా ఆలోచించకుండా.. ఈ సీన్ చేయలేనండి మార్చండి అని ఓపెన్ గా చెప్పేసిందట. దానికి నేను చెప్పిన కూడా చేయవా ? అని ప్రశ్నించారట. సార్ నాకు కంఫర్ట్గా అనిపించదు.. కొంచెం మార్చండి.. అని చెప్పడంతో చివరకు జ్యోతి ఇబ్బంది అర్థం చేసుకొని ఆ సీన్ కొంచెం మార్చి తీశారట ఈవీవీ. దీనిని బట్టి మనం తెరమీద ఎంజాయ్ చేసే బెడ్రూమ్ సింగ్ తో పాటు.. రకరకాల రొమాంటిక్ సన్నివేశాలలో నటించడానికి ఫిమేల్ యాక్టర్స్ ఎలా ఇబ్బంది పడుతున్నారు అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: