అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి లాంటి సూప‌ర్ హిట్ వ‌దులుకున్న హీరో ఎవ‌రో తెలుసా..!

frame అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి లాంటి సూప‌ర్ హిట్ వ‌దులుకున్న హీరో ఎవ‌రో తెలుసా..!

Amruth kumar
రవితేజ అప్పుడే హీరోగా ఎంట్రీ ఇచ్చి నిలదొక్కుకుంటున్న రోజులు అవి .. వెంటనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇడియట్ , అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి లాంటి రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాల లో నటించడం తో రవితేజ కెరీర్ ఒక్కసారిగా ఉహించ‌ని రెంజ్ కి వెళ్ళిపోయింది .. అమ్మానాన్న తమిళ అమ్మాయి సినిమాలో రవితేజ కి జోడిగా ఆసిన్ హీరోయిన్గా నటించింది .. ఈ సినిమాలో పాటలు డైలాగులు సూపర్ హిట్ అయ్యాయి .. అయితే ఇలాంటి సూపర్ హిట్ సినిమాను ఒక హీరో రిజెక్ట్ చేశారు .. ఆ వెంటనే ఈ అవకాశం రవితేజకు వచ్చింది .. ఆ హీరో ఎవరో కాదుకోలీవుడ్ న‌టుడు శ్రీరామ్ ర‌చ‌య‌త కోన వెంకట్ శ్రీరామ్ దగ్గరికి వెళ్లి రెండు కథలు చెప్పారట ..

ఇక‌ అందులో ఒకటి ఒకరికి ఒకరు రెండోది అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి .. ఈ రెండు కథలకు కూడా శ్రీరామ్ సైన్ చేశారు శ్రీరామ్‌ని హీరోగా ప్రకటించారు .. అదే టైంలో శ్రీరామ్ తమిళంలో మన సెల్ సినిమా చేస్తూ గాయపడ్డాడు .. కొద్దిరోజులపాటు యాక్షన్స్  వంటివి చేయవద్దని డాక్టర్లు సూచించారు .. అయితే అమ్మానాన్న ఓ తమిళమ్మాయి సినిమా క్లైమాక్స్లో ఫైటింగ్‌ ఉంటుంది .. తనకోసం ఆ స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసి ఆ సన్నివేశాన్ని మార్చడం శ్రీరామ్ కు ఎంత మాత్రం ఇష్టం లేదట .. ఆ బాక్సింగ్ పైట్  తీసేస్తే సినిమాకు న్యాయం జరగదు అందుకే ఆ సినిమా చేయలేని చెప్పడంతో వెంటనే రవితేజ తీసుకుని సినిమా పూర్తి చేశారు ..

ఆ వెంటనే రవితేజ శ్రీరామ్ కు ఫోన్ చేసి వెండి పళ్ళెంలో నాకు మంచి సినిమా ఇస్తున్నావు థాంక్స్ అని చెప్పారట .. ఆ తర్వాత తనకు తమిళంలో వరుసగా అవకాశాలు వచ్చాయి .. అక్కడే సెటిల్ అయ్యాను అని శ్రీరామ్ చెప్పారు .. తనకు తెలుగు సినిమాలు అన్న తెలుగు ప్రేక్షకులు అన్న ఎంతో ఇష్టమని శ్రీరామ్ చెప్తూ ఉంటారు .. శ్రీరామ్ అసలు పేరు శ్రీకాంత్ తెలుగులో ఒకరికొకరు , ఆ తర్వాత ఆడవారి మాటలకు అర్థాలే వేరులే , పోలీస్ పోలీస్  నిప్పు , రావణాసుర సినిమాలలో ప్రత్యేక పాత్రలలో కనిపించారు ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: