ఆ విషయంలో బిగ్ బాస్ విన్నర్ దే తప్పు ఆ..?
ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన కావ్యశ్రీ ని నిఖిల్ కాలవలేదు. అలాగే వారిద్దరూ వేరే షోలో ఎదురు పడినప్పటికి నిఖిల్, కావ్యతో మాట్లాడలేదు. దీంతో నిఖిల్ ని అభిమానించే వారే.. తనను తప్పుపడుతున్నారు. నిఖిల్ బిగ్ బాస్ లో ఫేక్ గా నటించడానికి అనుకుంటున్నారు. అసలు దీనిపై ఇంతవరకు నిఖిల్ క్లారిటీ ఇవ్వకపోవడంతో అందరూ నిఖిల్ దే తప్పు అని అనుకుంటున్నారు. ఇకపై ఏం జరుగుతుందో చూడాలి మరి. ఇకనైనా నిఖిల్ స్పందిస్తాడో లేదో చూడాలి.
ఇకపోతే స్టార్ మా లో ప్రసారం అయ్యే గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నిఖిల్.. అందరి మనసు దోచుకున్నాడు. ఆయన నటనతో తెలుగు వారిని కూడా ఎంతగానో ఆకట్టుకున్నాడు. అంతేకాదు నిఖిల్ స్టార్ మాలో ప్రసారమయ్యే ప్రతి షోలో పాల్గొనేవాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 8లో ఆఫర్ రావడంతో మొదటి కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. తన మాట, ఆటతో ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకున్నాడు. నిఖిల్ కి మాత్రమే సీజన్ 8 విన్నర్ అయ్యే అర్హత ఉందని ప్రేక్షకుల అందరి నోట అనిపించుకున్నాడు. ఈ సీజన్ లో 22 మంది దాటుకొని 105 రోజులు బిగ్ బాస్ హౌస్ లో జర్నీ చేసి గెలిచాడు. రూ. 55 లక్షల ప్రైజ్ మనీతో పాటు మారుతీ లగ్జరీ కారుని కూడా బహుమతిగా పొందాడు.