రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా ఇటీవల జనవరి 10న థియేటర్స్ లో రిలీజయిన సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో భారీ బడ్జెట్ తో శంకర్ దర్శకత్వంలో గ్రాండ్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. మొదటి రోజు 186 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సంక్రాంతి పండగ కావడంతో ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీలు కూడా థియేటర్ కి వెళ్లి సినిమాని చూసే ప్లాన్ లో ఉన్నారు.కానీ గేమ్ ఛేంజర్ సినిమాని కొంతమంది రెండో రోజే HD ప్రింట్ లీక్ చేశారు. సోషల్ మీడియాలో, టెలిగ్రామ్ లో సినిమాని షేర్ చేశారు. ఆన్లైన్ లో పైరసీ ప్రింట్ ని రిలీజ్ చేశారు. కొన్ని ప్రైవేట్ బస్సుల్లో కూడా గేమ్ ఛేంజర్ సినిమాని టెలికాస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో నే ఈ సినిమాని ఏపీ లోని కొన్ని కేబుల్ టీవీ లో ప్రసారం అవుతున్నట్లు తెలుస్తోంది. ఏపీ లోకల్ టీవీ ఛానల్ లో హెచ్డీ ప్రింట్ ప్రసారం చేస్తున్నారని కొందరు నేటిజన్లు ఎక్స్ వేదికగా ఫిర్యాదు చేస్తున్నారు.దీంతో మూవీ టీమ్ పైరసీ విషయంలో సీరియస్ అయింది. తాజాగా మూవీ యూనిట్ దీనిపై సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పటివరకు దీని పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు.అలాగే కొన్ని సోషల్ మీడియా పేజీలు సినిమా క్లిప్స్ షేర్ చేయడంతో పాటు కీలకమైన ట్విస్టులు రివీల్ అయ్యేలా చేసి ఆడియన్స్ సినిమాను ఎంజాయ్ చేయకుండా చేశారు. దాంతో ఆ పేజీల మీద కూడా కంప్లైంట్స్ నమోదు చేశారు మూవీ యూనిట్.ఈ క్రమంలో గేమ్ చేంజర్ మూవీ యూనిట్ ని బెదిరించిన, పైరసీ ప్రింట్ లీక్ చేసిన 45 మంది మీద ఆధారాలతో సహా సైబర్ క్రైమ్‌లో కంప్లైంట్ చేసింది మూవీ యూనిట్. ఆ 45 మంది కలిసి ఓ ముఠాగా ఏర్పడి గేమ్ ఛేంజర్ మీద నెగెటివిటీ స్ప్రెడ్ చేశారా? పైరసీ ప్రింట్ లీక్ చేశారా? లేదంటే వాళ్ళ వెనుక ఎవరైనా ఉన్నారా? అనేది తెలియాలి. ఈ కేసును సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.