ఎన్టీఆర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా రాకపోవడానికి అసలు కారణాలివేనా?

frame ఎన్టీఆర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా రాకపోవడానికి అసలు కారణాలివేనా?

Reddy P Rajasekhar
టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలామంది స్టార్ డైరెక్టర్లు జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తారనే సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకుడిగా ఏకంగా 8 విజయాలను సొంతం చేసుకోగా టైర్1 హీరోలు అనిల్ రావిపూడికి ఛాన్స్ ఇస్తే ఈ డైరెక్టర్ రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది.
 
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని తాను ప్రయత్నించానని అయితే కొన్ని కారణాల వల్ల మా కాంబో సెట్ కాలేదని అనిల్ రావిపూడి తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ తో తనకు మంచి అనుబంధం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా రాకపోవడానికి అసలు కారణాలివేనని తెలిసి నెటిజన్లు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.
 
ఈ కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్ పై బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వేగంగా సినిమాలను తెరకెక్కించే ప్రతిభ కూడా ఈ దర్శకుని సొంతం కాగా స్టార్ హీరోలు ఛాన్స్ ఇస్తే కేవలం మూడు లేదా నాలుగు నెలల్లో షూట్ ను పూర్తి చేసే టాలెంట్ అనిల్ రావిపూడికి ఉంది. 11 ఏళ్ల సినీ కెరీర్ లో అనిల్ రావిపూడి ఏకంగా 8 సినిమాలను తెరకెక్కించారనే సంగతి తెలిసిందే.
 
అనిల్ రావిపూడి సినిమాల్లో హీరోగా నటిస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తుండగా నటనకు సంబంధించి ఆయన మనస్సులో ఏముందో తెలియాల్సి ఉంది. అనిల్ రావిపూడి భవిష్యత్తు ప్రాజెక్ట్స్ తో సైతం బ్లాక్ బస్టర్ హిట్లు సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అనిల్ రావిపూడి భవిష్యత్తులో బాక్సాఫీస్ ను షేక్ చేసేలా మరిన్ని భారీ హిట్లు అందుకుంటే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. వరుస విజయాలతో అనిల్ రావిపూడి రేంజ్ పెరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: