అనుపమ పరమేశ్వరన్ అంటే ప్రత్యేకపరిచయాలు అక్కర్లేని పేరు.ఈమె ఇండస్ట్రీలో ఉండే హీరోతో ప్రేమలో పడిందని చాలా రోజుల నుండి టాక్ వినిపిస్తుంది. అయితే తాజాగా అనుపమ పరమేశ్వరన్ మాట్లాడిన మాటలను బట్టి ఆమెకు లవ్ బ్రేకప్ అయ్యిందని, అందుకే అలాంటి మాటలు మాట్లాడింది అంటూ అనుకుంటున్నారు. మరి ఇంతకీ అనుపమ మాట్లాడిన మాటలు ఏంటి అనేది చూద్దాం. గత ఏడాది టిల్లు స్క్వేర్ మూవీ తో హిట్ కొట్టిన అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఓ పాపులర్ మ్యాగ్జిన్ ఫోటోషూట్ లో పాల్గొంది. అయితే ఈ ఫోటోషూట్ అయిపోయాక ప్రెస్మీట్లో సంచలన వ్యాఖ్యలు చేసింది అనుపమ. ఆమె మీడియా మిత్రులతో మాట్లాడుతున్న సమయంలో ఆమె పర్సనల్ లైఫ్ గురించి ప్రేమ గురించి ఒక క్వశ్చన్ ఎదురైంది.
ఇక ప్రేమ గురించి అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. జీవితంలో ఎప్పటికీ ప్రేమిస్తాను అని చెప్పడం అనేది పెద్ద అబద్ధం. ఇందులో ఎలాంటి నిజం లేదు. ఎప్పటికి ప్రేమిస్తాను అనే విషయాన్ని అస్సలు నమ్మకూడదు.అది ఎప్పటికీ జరగదు కూడా.. టాక్సిక్ రిలేషన్ లో ఉన్నవాళ్లు ఎవరైనా సరే తొందరగా పారిపోండి అంటూ ప్రేమ గురించి షాకింగ్ కామెంట్లు చేసింది అనుపమ పరమేశ్వరన్. ఇక అనుపమ మాటలు విన్న చాలామంది నెటిజన్స్ అనుపమ పరమేశ్వరన్ ప్రేమ గురించి ఎందుకు అలాంటి మాటలు మాట్లాడింది..
ఆమెకు బ్రేకప్ అయ్యిందా.. అందుకే ప్రేమ పెద్ద అబద్ధం అనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడిందా.. నిజంగానే అనుపమ హార్ట్ బ్రేక్ అయ్యే అలాంటి మాటలు మాట్లాడిందా అంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు. ఇక అదే ప్రెస్ మీట్ లో అనుపమ తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ..నేను ఉదయం లేవడంతోనే ఫోన్ కి చాలా దూరంగా ఉంటాను. అలాగే ఈ ప్రపంచంలో బతికేది ఒక్కరోజే అని నాకు ముందుగానే తెలిస్తే నాకు బాగా నచ్చిన ఫుడ్ తిని ఎంజాయ్ చేస్తాను అంటూ అనుపమ చెప్పుకొచ్చింది. ఇక అనుపమ నటించిన చాలా సినిమాలు ఈ ఏడాదిలో విడుదలకి సిద్ధంగా ఉన్నాయి