
దటీజ్ రామ్ చరణ్.. స్నేహితుడి గొప్పతనం బయటపెట్టిన శర్వా
అయితే ఇటీవల మెగా హీరో రామ్ చరణ్ అన్ స్టాపబుల్ షోలో సందడి చేశారు. అందులో బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తారు. అయితే షోలో బాలయ్యతో కలిసి రామ్ చరణ్ చాలా విషయాలు పంచుకున్నాడు. అలాగే రామ్ చరణ్ తన కూతురు క్లీంకార గురించి చెప్తూ.. కాస్త ఎమోషనల్ కూడా అయ్యాడు. ఇక ఆ షోలోకి శర్వానంద్, యూవీ విక్రమ్ కూడా ఎంట్రీ ఇచ్చారు. వచ్చారు.
అయితే ఆ షోలో శర్వానంద్, రామ్ చరణ్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అందులో రామ్ చరణ్ చాలా గొప్ప వాడని శర్వా చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్ సాయం చేస్తే.. ఆ సాయం పొందిన వాడికి కూడా రామ్ చరణ్ సాయం చేశాడని తెలీదు అంటూ శర్వా తెలిపారు. అంటే తన స్నేహితుడు రామ్ చరణ్ ఏం సాయం చేసిన అది అంత రహస్యంగా, ఎవ్వరికీ తెలియకుండా సాయం చేస్తాడన్న శర్వా అన్నాడు. ఇక శర్వా, విక్కీ, చెర్రీలతో బాలయ్య బాగానే ఆడుకున్నాడు. ఈ ముగ్గరి సీక్రెట్లను బయట పెట్టే ప్రయత్నం చేశాడు. ఇది చూసిన నెటిజన్లు దటీజ్ రామ్ చరణ్ అంటూ సోషల్ మీడియాలో ఆ వీడియోని పోస్టు చేసి వైరల్ చేస్తున్నారు.