బోయపాటికి సాధ్యం కానిది బాబీకి సాధ్యమైందిగా.. ఆ రికార్డ్ తో అదరగొట్టాడుగా!
బోయపాటి శ్రీను బాలయ్యతో మూడు సినిమాలను తెరకెక్కించగా ఆ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. అయితే బాబాయ్ కు హిట్ ఇచ్చిన బోయపాటి శ్రీను అబ్బాయ్ జూనియర్ ఎన్టీఆర్ కు హిట్ ఇచ్చే విషయంలో ఫెయిలయ్యారు. బోయపాటి శ్రీను జూనియర్ ఎన్టీఆర్ తో దమ్ము సినిమాను తెరకెక్కించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అయితే అందుకోలేదని కచ్చితంగా చెప్పవచ్చు.
అయితే బాబీ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కు జై లవకుశ సినిమాతో బాలయ్యకు డాకు మహారాజ్ సినిమాతో భారీ హిట్లు అందించారు. ఈ రెండు సినిమాలు కలెక్షన్ల విషయంలో సైతం అదరగొట్టాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. దర్శకుడు బాబీ నందమూరి హీరోల ఫేవరెట్ డైరెక్టర్లలో ఒకరిగా మారిపోయారు. బాలయ్య బాబీ కాంబినేషన్ లో భవిష్యత్తులో మరిన్ని సినిమాలు తెరకెక్కే ఛాన్స్ ఉంది.
పాన్ ఇండియా సబ్జెక్ట్ లను సైతం డీల్ చేయగల సత్తా బాబీకి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాబీ తర్వాత ప్రాజెక్ట్స్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది. బాబీ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. డాకు మహారాజ్ కలెక్షన్ల విషయంలో సైతం సంచలనాలు సృష్టిస్తోంది. చిన్నారి సెంటిమెంట్ ఈ సినిమాకు అన్ని విధాలుగా కలిసొచ్చిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. డాకు మహారాజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన సంగతి తెలిసిందే.