షాక్: గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్ లో రూ .100 కోట్ల తేడానా..?

frame షాక్: గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్ లో రూ .100 కోట్ల తేడానా..?

Divya
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం గేమ్ ఛేంజర్. కియారా అద్వాని, అంజలి, సునీల్, ఎస్ జె సూర్య, శ్రీకాంత్, రాజీవ్ కనకాల తదితర నటీనటులు సైతం ఇందులో కీలకమైన పాత్రలో నటించారు. గేమ్ ఛేంజర్ ట్రైలర్తో ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా విడుదలైన రోజు కాస్త మిక్స్డ్ టాక్ వచ్చిన అడ్వాన్స్ బుకింగ్ లో మాత్రం కొంతమేరకు హడావిడి సృష్టించింది. చాలా ఏరియాలలో కూడా గేమ్ ఛేంజర్ సినిమా కి హౌస్ ఫుల్ బోర్డులు కూడా కనిపించాయి.


మొదటి రోజే కలెక్షన్స్ పరంగా కూడా భారీగా సాధించినట్లు చిత్ర బృందం అయితే తెలియజేసింది. అయితే మేకర్స్ ఈ సినిమా 186 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని తెలియజేశారు. అయితే ఈ విషయం పైన చాలామంది అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మేకర్స్ విడుదల చేసిన పోస్టర్స్ కి బాక్సాఫీస్ ట్రాకర్స్ మధ్య వ్యత్యాసం ఉందని చర్చనీయంశంగా మారింది. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద వినిపిస్తున్న సమాచారం మేరకు వరల్డ్ వైజ్ గా ఈ సినిమా 85 కోట్ల రూపాయలు సాధించిందని సమాచారం.


అయితే ఈ సమయంలోనే మేకర్స్ సైతం తమ అఫీషియల్ పోస్టర్ ద్వారా 186 కోట్ల రూపాయలు వచ్చిందంటూ అధికారికంగా ప్రకటించారు. అయితే ఇది సినీ ప్రేక్షకులను , ట్రేడ్ వర్గాలను సైతం ఆలోచింపజేసేలా చేస్తోందట. ఏకంగా ట్రాకర్స్ మరియు మేకర్స్ మధ్య 100 కోట్ల రూపాయలు వ్యత్యాసం కనిపించడంతో ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతున్నది. అయితే ఇలాంటి తేడా ఇది కొత్తేమీ కాదు గతంలో కూడా చాలా సినిమాలకు ఇలాంటి విషయాలు ఎన్నో సినిమాలుకు జరిగాయట. అయితే మరి కొంతమంది నిర్మాతలు మాత్రం కేవలం అభిమానుల కోసమే ఇలాంటి నెంబర్లు వేస్తారని చాలామంది నిర్మాతలు ఇప్పటికే డైరెక్ట్ గా చెప్పేశారు. మరి మొత్తానికి గేమ్ ఛేంజర్ సినిమా  కలెక్షన్స్ పరిస్థితి ఏంటో మరో వారం రోజుల్లో తేలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: