‘గేమ్ ఛేంజర్’ రెస్పాన్స్‌పై ఉపాసన ట్వీట్ చూశారా...!
టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సినిమా ‘ గేమ్ ఛేంజర్ ’ .. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను కోలీవుడ్ సీనియర్ దర్శకుడు శంకర్ పూర్తి పొలిటికల్ డ్రామాగా తెరకెక్కించగా .. హీరో రామ్ చరణ్ తన సాలిడ్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు తన వంతుగా ట్రై చేశాడు. సినిమా లో చరణ్ పెర్పామెన్స్ బాగుందని అందరూ చెపుతున్నా కూడా సినిమా శంకర్ స్థాయి లో లేదనే ఎక్కువ మంది చెపుతున్నారు. ఇంత భారీ బడ్జెట్ .. మూడేళ్ల కష్టం అన్ని వృథా అయినాయని కూడా ఎక్కువ మంది మెగా భిమానులు ఫీలవుతున్నారు.
ఇదిలా ఉంటే సినిమా కు టాక్ ఎలా ఉన్నా చాలా రోజుల తర్వాత చరణ్ నుంచి పాన్ ఇండియా సినిమా ... అది కూడా ఐదేళ్ల తర్వాత చరణ్ సోలోగా చేసిన సినిమా కావడంతో చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో స్పందించారు. తన భర్త నటించిన ‘ గేమ్ ఛేంజర్ ’ మూవీకి వస్తున్న రెస్పాన్స్‌పై ఆమె తాజాగా ఓ ట్వీట్ చేశారు. ‘ గేమ్ ఛేంజర్ ’ సినిమా కి వస్తున్న రెస్పాన్స్ అద్భుతంగా ఉందని .. రామ్ చరణ్‌కు కంగ్రాట్స్ చెబుతున్నట్లు ఉపాసన తన ట్వీట్ లో పేర్కొన్నారు. అలాగే ప్రతి విషయంలోనూ రామ్ చరణ్ నిజమైన ‘ గేమ్ ఛేంజర్ ’ అని ఆమె తన భర్త ను ఆకాశానికి ఎత్తేశారు. తన భర్త సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌పై ఉపాసన ట్వీట్ చేయడంతో ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. ఇక గేమ్ ఛేంజర్ లో చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించారు.