నెల్లూరు సిటీలో నెవ్వర్ బిఫోర్... ఎవ్వర్ ఆఫ్టర్ రికార్డు సెట్ చేసిన ' గేమ్ ఛేంజర్ ' .. !
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా గేమ్ చేంజెర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈరోజు నుంచి సందడి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో మిడ్ నైట్ షో ల నుంచే గేమ్ ఛేంజర్ ప్రదర్శనలు మొదలయ్యాయి .. ఇటు తెలంగాణ లో ఉదయం 4 గంటల షో లతో గేమ్ ఛేంజర్ ప్రదర్శిస్తున్నారు. ఇక ఎప్పుడో 2019లో సంక్రాంతికి వచ్చిన వినయ విధేయ రామ లాంటి సినిమా తర్వాత ఐదేళ్లకు మళ్ళీ రాంచరణ్ సోలోగా నటించినా ఈ సినిమాను సీనియర్ దర్శకుడు శంకర్ తెరకెక్కించగా ... దిల్ రాజు రు. . 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. దాదాపు మూడు సంవత్సరాల నుంచి పూరిస్తూ వస్తున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా ? అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ సినిమా ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగా సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆత్రుతతో ఉన్నారు. .
ఈ సినిమా టికెట్ బుకింగ్స్ నెల్లూరు సిటీలో ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేశాయి. గేమ్ ఛేంజర్ మూవీ డే వన్ ఆల్ టైం రికార్డు నెల్లూరు సిటీలో క్రియేట్ చేసింది. మొత్తం 103 షోలకు గాను 1.15 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దీనిని బట్టి గేమ్ ఛేంజర్ మూవీ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. ఏది ఏమైనా నెల్లూరు సిటీలో పాత రికార్డులకు పాతర వేసి సరికొత్త రికార్డులు సెట్ చేసింది అని చెప్పాలి. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా బాలీవుడ్ అందాల భామ కీరా అద్వానీ హీరోయిన్గా నటించగా ... అంజలి మరో హీరోయిన్గా నటించారు నటించారు. తమన్ సంగీతం అందించారు.