"అత్తారింటికి దారేది".. బన్నీకి పెద్ద సమస్య వచ్చి పడ్డిందే..!

Thota Jaya Madhuri
చూస్తూ ఉంటే బన్నీకి పెద్ద సమస్య వచ్చి పడినట్లుంది అంటున్నారు జనాలు . కొంతమంది అయ్యయ్యో బన్నీకి ఎంత కష్టమొచ్చిందో ..? అంటూ బాధపడిపోతుంటే.. మరి కొంతమంది మాత్రం హెడ్ వెయిట్ తో చేస్తే ఇలానే ఉంటుంది ..ఎక్కడ డోర్లు అక్కడ క్లోజ్ అయిపోతాయి అంటూ చీప్ గా కామెంట్స్ పెడుతున్నారు . అసలు మేటర్ ఏంటంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీకి మధ్య కొంచెం డిస్టబెన్స్ ఉన్న విషయం ఓపెన్ గా మెగా హీరోస్ స్పీచ్ కారణంగా వాళ్ళ బిహేవియర్ కారణంగా అర్థం అయిపోతుంది. పుష్ప2 ప్రమోషన్స్ లో కానీ సినిమా గురించి కానీ ఒక్క మెగా హీరో స్పందించలేదు . అయితే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయితే మాత్రం చిరంజీవి ఇంటికి వెళ్లి మరి పరామర్శించారు .


ఆ తర్వాత చిరంజీవిని దగ్గరుండి బెయిల్ ఇప్పించాడు అన్న కామెంట్స్ కూడా ఎక్కువ వినిపించాయి . అయితే ఆ తర్వాత బన్నీనే స్వయంగా వెళ్లి థాంక్స్ చెప్పేసి చిరంజీవి-నాగబాబు ఇంటికి కూడా వెళ్లి వచ్చాడు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కి బిగ్ ప్రాబ్లం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ - మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్ లో పాల్గొంటాడా..? పాల్గొనలేడా..? అనే టాక్ హాట్ హాట్ గా మారింది . ప్రతి ఇయర్ సంక్రాంతిని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సెలెబ్రేట్ చేస్తూ ఉంటారు . దానికి సంబంధించి ముందే అందరి హీరోస్ కి ఆ టయానికి కాల్ షీట్స్ ఫీల్ కాకుండా చూసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటారు.  అయితే అప్పుడు పరిస్థితి వేరు .


ఇప్పుడు పరిస్థితి వేరు . ఇప్పుడు అల్లు అర్జున్ బెయిల్ పై ఉన్నాడు . అయితే అల్లు అర్జున్ ని మెగా సంక్రాంతి సెలబ్రేషన్ కి పిలుస్తారా..? పిలవరా..? అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ . గతంలో జరిగిన ఇష్యూస్ ఏవి కూడా ఇంకా మారలేదు . మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని అల్లు అర్జున్ మీట్ అవుతాను అంటుంటే ఆయన అపాయింట్ మెంట్ ఇవ్వట్లేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి . అరెస్టు తరువాత ఏదో పరోక్షంగా బన్నీ పై స్పందించాడు కానీ ఎక్కడ పవన్ - బన్నీ మీట్ అయిన  సందర్భాలు లేవు. మెగా సెలబ్రేషన్స్ కి అటెండ్ అయితే వాళ్ళిద్దరూ ఫేస్ టు ఫేస్ ఎదురుపడాల్సిన సివ్హ్యూవేషన్ వస్తుంది.


ఒకవేళ అలాంటి సిచువేషన్ ఫేస్ చేయడం ఇష్టం లేకపోతే చిరంజీవి అసలు అల్లు అర్జున్ ని సంక్రాంతి సెలబ్రేషన్స్లో ఇన్వాల్వ్ చేయడు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి .దీంతో బన్నీని సంక్రాంతి సెలబ్రేషన్స్ కి పిలుస్తారా..? పిలవరా..? అనేది ఒక హాట్ టాపిక్ గా మారింది . అయితే అల్లు అర్జున్ ]ఈ క్రమంలోనే  తన మేనత్తని మిస్ అయిపోతూ ఉంటాడు అంటూ కూడా ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది.  ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది మూవీ టైటిల్ ని కూడా బాగా ట్రోలింగ్కి వాడేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: