అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై.. నిహారిక షాకింగ్ కామెంట్స్..

Divya
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉండేటువంటి సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఇప్పటికీ అల్లు అర్జున్ ని వెంటాడుతూనే ఉంది.. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం చికిత్స పొందుతూ ఉన్నారు. ఇటీవలే అల్లు అర్జున్ కూడా కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి మరి పరామర్శించారు. ఇలాంటి సందర్భంలోనే తాజాగా మెగా డాక్టర్ నిహారిక ఈ విషయం పైన స్పందిస్తూ పలు విషయాలను తెలిపింది.
నిహారిక హీరోయిన్గా నటించిన తాజా చిత్రం మద్రాస్ కారన్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహించగా ఇందులో హీరోగా షాన్ నిగమ్ నటించారు జనవరి 10వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిహారిక పలు రకాల ఇంటర్వ్యూలలో పాల్గొనింది. ఈ సమయంలోనే సంధ్య థియేటర్ ఘట్టం పైన స్పందిస్తూ సంధ్య థియేటర్ ఘటన తనకు చాలా బాధను కలిగించిందని ఇలాంటి సంఘటనను ఎవరు ఊహించలేదని కూడా తెలిపింది. ఈ విషయం విన్న తర్వాత తన మనసు కూడా ముక్కలైందని వెల్లడించింది నిహారిక.

అల్లు అర్జున్ కూడా ఇప్పుడిప్పుడే ఈ బాధ నుంచి బయటపడుతున్నారని తెలిపింది. 2016లో ఒక మనసు అనే చిత్రం ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక ఆ తర్వాత సూర్యకాంతం తదితర చిత్రాలలో నటించింది. కానీ ఏవి హీరోయిన్ గా ఈమెకు సక్సెస్ అందుకునేలా చేయలేదు. 2019లో యాక్టింగ్ కి దూరంగా ఉన్న నిహారిక పలు రకాల వెబ్ సిరీస్ లను నిర్మించింది. గత ఏడాది కమిటీ కుర్రోళ్ళు అనే సినిమాతో నిర్మాతగా మారడం జరిగింది ఇది సక్సెస్ అయ్యింది.ఇప్పుడు మరొకసారి హీరోయిన్గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిహారిక ప్రయత్నాలు చేస్తోంది. మరి ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: