హీరోల మధ్య కాదు దర్శకుల మధ్య పోటీ.. శంకర్, బాబీ, అనిల్ లలో టాప్ ఎవరు?
నైజాంలో కూడా డాకు మహారాజ్ సినిమాకు మంచి థియేటర్లు దక్కాయని సమాచారం అందుతోంది. దిల్ రాజు ఏ సినిమాకు అన్యాయం జరగకుండా అన్ని సినిమాలకు సమ న్యాయం జరిగేలా చూసుకుంటున్నారని సమాచారం అందుతోంది. శంకర్ గేమ్ ఛేంజర్ సినిమా కోసం మూడున్నర సంవత్సరాల పాటు కష్టపడ్డారనే సంగతి తెలిసిందే.
దర్శకుడు బాబీ వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ సాధించగా డాకు మహారాజ్ సినిమాతో అంతకు మించిన హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అంతకు మించిన విజయాన్ని సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ డైరెక్టర్ల రెమ్యునరేషన్లు సైతం భారీ రేంజ్ లో ఉన్నాయి.
సౌత్ ఇండియా డైరెక్టర్లు వరుస విజయాలను సొంతం చేసుకుంటూ సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి సౌత్ సినిమాలు నార్త్ ఇండియాలో సైతం సంచలన విజయాన్ని సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. సౌత్ ఇండియా డైరెక్టర్లకు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. సంక్రాంతి సినిమాలన్నీ సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సంక్రాంతి సినిమాల కోసం ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బుక్ మై షోలో టాలీవుడ్ సినిమాల హవా కొనసాగుతోంది. సంక్రాంతి సినిమాలు కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సంక్రాంతి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తాయో చూడాల్సి ఉంది.