టాలీవుడ్ సీనియర్ హీరోలకు నెవర్ ఆఫ్టర్ డైరెక్టర్ .. హీరో ఇమేజ్‌కు తగ్గట్టుగా కథలు రాయాలంటే అతనే..!

Amruth kumar
ప్రజెంట్ ఉన్న జనరేషన్లో హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉన్న దర్శకులలో అనిల్ రావిపూడి కూరా ఒకరు .. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ను పర్ఫెక్ట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఈ దర్శకుడు హీరోల ఇమేజ్ ను క్యాష్ చేసుకోవటం లో నెంబర్ వన్ గా నిలిచాడు .. ఇప్పటికే మంచి విజయాలు సాధించిన సినిమాలతో పాటు ఆప్ కమింగ్ సినిమాలు విషయం లోనూ హీరోల ఇమేజ్ కు తగ్గట్టుగా కథలను రెడీ చేస్తున్నాడు. పటాస్ , రాజా ది గ్రేట్ , ఎఫ్2 లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న అనిల్ రావుపూడి ఆ విజయాలతో స్టార్ డైరెక్టర్ల లిస్టులోకి ఎంట్రీ ఇచ్చాడు ..

అదే జోరులో మహేష్ హీరోగా సరిలేరు నీకెవ్వరు సినిమాను తెరకెక్కించాడు . మహేష్ ఇమేజ్ కు తగ్గట్టుగా యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ను పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ ప్రేక్షకులు ముందుకు వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా అనిల్ ను స్టార్ దర్శకుల‌ లిస్టులోకి చేర్చింది . ఇక బాలయ్య హీరో గా వచ్చిన భగవంత్‌ కేసరి విషయం లోను డిఫరెంట్ స్టైల్ ఫాలో అయ్యాడు  తన మార్క్ ఎంటర్టైన్మెంట్ చూపిస్తేనే బాలయ్య మాస్ ఇమేజ్‌కు ఎక్కడ తగ్గకుండా పర్ఫెక్ట్ యాక్షన్ సినిమాను తీసుకువచ్చాడు.

అందుకే భగవంత్‌ కేసరి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది ... ప్రస్తుతం వెంకటేష్ హీరో గా సంక్రాంతికి వస్తున్నాం అనే ఫ్యామిలీ సినిమా తో అనిల్ రావిపూడి ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు .. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నట్టు గా తెలుస్తుంది .. అంతేకాకుండా చిరంజీవి కోసం రెడీ చేసే కథ కూడా గ్యాంగ్ లీడర్ , ఘరానా మొగుడు రేంజ్ లో ఉంటుందంటూ అంచనాలు పనిచేస్తున్నాడు .. ఇలా ప్రతి హీరోకు వారి ఇమేజ్ కు తగ్గా కథలు రెడీ చేస్తూ డిఫరెన్స్ స్ట్రాటజీతో దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: