ప్రభాస్ రీల్ తల్లితో ప్రేమ.. క్లారిటీ ఇచ్చిన నటుడు?
విషయం ఏమిటంటే, కొన్నాళ్లుగా తెలుగు తెరపైన కనబడని సురేష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. ఈ క్రమంలో నటి "నదియా" గురించి చెప్పుకొచ్చాడు. నదియా గురించి అందరినీ తెలిసిందే. అప్పట్లో నటుడు సురేష్ కి నదియాకి మధ్య రిలేషన్ ఉన్నట్టు పుకార్లు నడిచేవి. ఈ విషయమై ఆయనికి ఇపుడు ప్రశ్నించగా... చాలా ఆసక్తికరమైన అంశాలు చెప్పుకొచ్చాడు.
ఈ నేపథ్యంలో సురేష్ మాట్లాడుతూ... "నదియాతో నేను ఎన్నో సినిమాలు చేశాను. మేము చాలా మంచిగా మాట్లాడుకొనేవాళ్ళం. ఆమె అప్పట్లో శిరీష్ అనే అబ్బాయిని ప్రేమించేది. ఇక నా పేరు సురేష్ కావడం వలన ఇద్దరు పేర్లు పలకడానికి ఒకేలా ఉండడంతో సెట్ లో అందరు ఆమె నాతోనే మాట్లాడుతుంది... ఇక నన్నే ప్రేమిస్తుంది అనుకునేవారు. మేము ఇద్దరం ప్రేమలో ఉన్నామని పొరపాటు పడ్డారు. కానీ, నదియా నాకు చెల్లిలు లాంటిది. నదియా అందరిలా కాదు. చాలా స్ట్రాంగ్ పర్సన్. ఎప్పటివరకు ఇండస్ట్రీలో ఉండాలి... ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి. ఎప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలి! అని అన్ని చాలా చక్కగా ప్లాన్ చేసుకుంది. అప్పటినుంచి ఇప్పటివరకు మేము బెస్ట్ ఫ్రెండ్స్ గానే ఉన్నాం. మాకు వాట్సప్ లో ఒక గ్రూప్ కూడా ఉంది. అప్పుడప్పుడూ కలుస్తూ ఉంటాము!" అని సురేష్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణ లతో నటించిన నదియా పెళ్లి తరువాత కొంత గ్యాప్ తీసుకొని మిర్చి సినిమాతో తెలుగుతెరకు రీఎంట్రీ ఇచ్చిన సంగతి విదితమే. ఆ తరువాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది అనే సినిమాలో పవన్ కు అత్తగా నట విశ్వరూపం చూపించింది.