ఇండియన్ క్రికెట్ టీం లో అద్భుతమైన ఆటగాడిగా గుర్తింపును సంపాదించుకున్న వారిలో సచిన్ టెండూల్కర్ ఒకరు. ఈయన ఎన్నో గొప్ప గొప్ప ఇన్నింగ్స్ లను ఆడి భారత క్రికెట్ జట్టుకి అనేక విజయాలను అందించాడు. ఈయన ఆట తీరుతో ఆయన కేవలం భారతీయ అభిమానులను మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల అభిమానులను సంపాదించుకున్నాడు. ఇకపోతే సచిన్ టెండూల్కర్ కొన్ని సంవత్సరాల క్రితమే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపోతే పైన సచిన్ టెండూల్కర్ తో ఓ చిన్న పిల్లాడు ఉన్నాడు కదా ఆయన ఎవరో గుర్తుపట్టారా ..? ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటుడిగా కెరియర్ ను కొనసాగిస్తున్న ఒక నటుడి కుమారుడు.
ఇప్పటికే ఆ నటుడి కుమారుడు కూడా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో నటించాడు. ఇప్పటికైనా సచిన్ తో పాటు ఉన్న చిన్న పిల్లాడు ఎవరో గుర్తుపట్టారా ..? ఆ చిన్న పిల్లడు మరెవరో కాదు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటుడిగా కెరీర్ ను కొనసాగిస్తున్న మేక శ్రీకాంత్ తనయుడు రోషన్. రోషన్ "నిర్మల కాన్వెంట్" అనే సినిమాతో హీరో గా పరిచయం అయ్యాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా పెద్ద స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దానితో ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.
ఇకపోతే కొంత కాలం క్రితం ఈయన పెళ్లి సందD అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కూడా పరవాలేదు అనే రేంజ్ విజయాన్ని మాత్రమే అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈయన తన తదుపరి మూవీ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. రోషన్ నటించింది రెండు సినిమాలే అయినా కూడా తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఓ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.