2025 :సంక్రాంతి సినిమాలకు షాకే.. హైకోర్టులో పిటిషన్.. ఏం జరిగిందంటే..?

Divya
ప్రతి ఏడాది కూడా సంక్రాంతి సినిమాలో వార్ అనేది కచ్చితంగా కనిపిస్తూనే ఉన్నది. ఈ ఏడాది కూడా జనవరి 10న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, జనవరి 12న బాలయ్య డాకు మహారాజ్ జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలకు సంబంధించి టికెట్ల రేటు పెంపు విషయం పైన ఏపీ ప్రభుత్వం నిర్మాతలకు గుడ్ న్యూస్ అయితే తెలియజేసింది. అయితే ఇందులో కొన్ని సినిమాలకు టికెట్ల రేటు పెంచడంతో హైకోర్టులో పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. వాటి గురించి చూద్దాం.

జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా డాకు మహారాజు సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా టికెట్ల ధరలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం పలు ఉత్తర్లను కూడా జారీ చేసింది. అంటే జనవరి 12న తెల్లవారుజామున 4 గంటలకు బెనిఫిట్ షో టికెట్ ధరల విషయానికొస్తే.. 500 రూపాయలు నిర్ణయించారు. రెగ్యులర్ షోలకు, మల్టీప్లెక్స్ థియేటర్లో టికెట్లు ధరలు రూ .135 రూ.110 రూపాయలను పెంచుతూ జీవోను కూడా విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాకు కూడా బెనిఫిట్ షో రూ.600 రూపాయలను పెంచారు. రెగ్యులర్ షోకు, మల్టీప్లెక్స్ థియేటర్లకు రూ .135, రూ.110 రూపాయలను పెంచేలా జీవోలను జారీ చేశారు.

అయితే ఇప్పుడు తాజాగా డాకు మహారాజ్, గేమ్ ఛేంజర్ టికెట్ ధరలను పెంచడానికి సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారట. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం పైన ఈరోజు హైకోర్టులో విచారణ జరగబోతోందట. ఇలా సినిమాలకు బెన్ఫిట్ షోలు అనుమతి ఇవ్వడం వల్ల రాష్ట్రాలలో శాంతిభద్రతలు కూడా తగ్గిపోతాయని ప్రస్తావిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో భాగంగా ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీని జతచేస్తూ ఏపీలో టికెట్ ధరలు పెంచారని పిటిషన్లు కూడా పేర్కొన్నారు. మరి ఈరోజు విచారణలో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. మరి సంక్రాంతి సినిమాలకు హైకోర్టు షాక్ ఇస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: