ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప పార్ట్ 2 అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న పుష్ప మూవీ కి కంటిన్యూగా రూపొందింది. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటించగా ... సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా పోయిన సంవత్సరం డిసెంబర్ 5 వ తేదీన విడుదల అయింది. విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ఈ మూవీ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.
దానితో ఈ సినిమా ఇప్పటికే అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి ఎన్నో కొత్త రికార్డులను సృష్టించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ ను విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన 20 నిమిషాల నిడివిని యాడ్ చేస్తూ ఆ యాడ్ చేసిన వర్షన్ ను ఈ సంవత్సరం జనవరి 11 వ తేదీ నుండి థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు ఈ.మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.
ఇకపోతే పుష్ప పార్ట్ 1 మూవీ లోని అల్లు అర్జున్ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. అలాగే ఆ సినిమాలోని నటనకు ఆయనకు అల్లు అర్జున్ జీ నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఇకపోతే పుష్ప పార్ట్ 2 లో కూడా ఈయన తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో అనసూయ , సునీల్ , రావు రమేష్ , జగపతి బాబు ముఖ్య పాత్రలలో నటించారు.