సంక్రాంతి సినిమాలకు వైరస్ టెన్షన్.. దిల్ రాజుకు నాలుగుసార్లు ఇలా జరిగిందా?

Reddy P Rajasekhar
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా దిల్ రాజుకు పేరుందనే సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించడంతో పాటు మంచి లాభాలను సొంతం చేసుకున్నాయి. అయితే సంక్రాంతి సినిమాలను హెచ్.ఎం.పీ.వీ వైరస్ టెన్షన్ పెడుతోంది. వైరస్ కేసులు అంతకంతకూ పెరిగితే మాత్రం సంక్రాంతి సినిమాలకు ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.
 
దిల్ రాజుకు ఇలాంటి పరిస్థితులు ఎదురు కావడం ఇదే తొలిసారి కాదు. జోష్ సినిమా రిలీజ్ సమయంలో వైఎస్సార్ మరణం, ఎవడు సినిమా రిలీజ్ సమయంలో తెలంగాణ ఉద్యమం, వకీల్ సాబ్ రిలీజ్ సమయంలో కరోనా వైరస్, ప్రస్తుతం హెచ్.ఎం.పీ.వీ కేసులు ఇలా నాలుగు సార్లు దిల్ రాజు ఊహించింది ఒకటైతే మరో విధంగా జరిగింది. దిల్ రాజుకు మాత్రమే ఇలా జరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
హెచ్.ఎం.పీ.వీ విషయంలో ఏ మాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకునే వాళ్లు మాత్రం ఈ వైరస్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. సంక్రాంతి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. సంక్రాంతి సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
 
సంక్రాంతి సినిమాలకు బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఈ సినిమాల కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం. సంక్రాంతి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టిస్తాయేమో చూడాలి. ఏపీలో పెంచిన టికెట్ రేట్లు ఈ సినిమాకు ఒక విధంగా ప్లస్ కానున్నాయి. సంక్రాంతి సినిమాలు అంచనాలను మించి మెప్పించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సంక్రాంతి సినిమాల బుకింగ్స్ కోసం సినీ అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి సినిమాలకు క్రేజ్ మాత్రం మామూలుగా లేదని చెప్పవచ్చు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: