కొత్త భార్య తెచ్చి పెట్టిన అదృష్టం..టాలీవుడ్ ని షేక్ చేస్తున్న అఖిల్ అక్కినేని..!

Thota Jaya Madhuri
చూస్తుంటే అఖిల్ అక్కినేని అదృష్టం పూర్తిగా మారిపోయినట్టుంది. నిన్న మొదటి వరకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్ కి గురయ్యారో అందరికీ తెలిసిన విషయమే. మరీ ముఖ్యంగా అఖిల్ అక్కినేని - శ్రేయ భూపాల్ కు బ్రేకప్ చెప్పేయడం.. ఆమెను నమ్మించి మోసం చేశాడు అంటూ జనాలు బాగా బాగా ట్రోల్ చేశారు . అదేవిధంగా కెరియర్ పరంగా కూడా అస్సలు సెటిల్ కాలేని పొజిషన్లో ఉన్నాడు అంటూ ఏకిపారేశారు . అయితే అఖిల్ అక్కినేని మాత్రం అలాంటి ట్రోలింగ్ ని పెద్దగా పట్టించుకోలేదు . సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు.
అయితే ఎవరు ఊహించని విధంగా అన్న నిశతార్థమైన కొద్ది రోజులకే తమ్ముడు కూడా నిశ్చితార్థం చేసుకుని షాక్ ఇచ్చాడు అఖిల్ అక్కినేని.  జైనబ్ తో నిశ్చితార్ధం  చేసుకొని ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు . త్వరలోనే భార్యాభర్తలు కాబోతున్నామంటూ అఫీషియల్ గా ప్రకటించారు . అంతేకాదు నాగచైతన్య - శోభిత ధూళిపాల పెళ్లిలో ఈ కొత్త కాబోయే జంట బాగా సందడి చేసింది . ఎక్కడ చూసినా సరే అఖిల్ - జైనబ్  జంటే హైలెట్ గా నిలిచింది . అయితే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అఖిల్ అక్కినేని పేరు మారుమ్రోగిపోతుంది . దానికి కారణం ఎవరు ఊహించని విధంగా అఖిల్ అక్కినేని - రాజమౌళి సినిమాలో సెలెక్ట్ అయ్యాడు అన్న వార్తలు వినిపిస్తూ ఉండడమే.
అఖిల్ అక్కినేని ఏంటి..? రాజమౌళితో సినిమా ఏంటి ..? అంటూ ఇలా చాలామంది ఆయనను ట్రోల్ చేశారు . అయితే ఇన్సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు - రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో అఖిల్ అక్కినేని ఒక స్పెషల్ క్యారెక్టర్ లో మెరవబోతున్నారట . అఫ్ కోర్స్ ఈ సినిమాలో అఖిల్ అక్కినేని అవకాశం దక్కించుకోవడమే పెద్ద మేటర్ . అందుకే చిన్న క్యారెక్టర్ అయినా అఖిల్ సినిమాను ఓకే చేశారట . అందరూ ఈ అదృష్టాన్ని జైనబ్ రవ్జీ కి ఇచ్చేశారు.  ఆయన లైఫ్ లోకి  లక్ తెచ్చిపెట్టింది అంటూ మాట్లాడుకుంటున్నారు . కొత్త భార్య రాబోతున్న వేళా విశేషం అఖిల్ అక్కినేని లైఫ్ టర్న్ కాబోతుంది అంటూ ఓ రేంజ్ లో జైనబ్ ని  ప్రశంసించేస్తున్నారు. కాగా మార్చి ఆఖరి వారంలో జైఅంబ్ - అఖిల్ పెళ్లి జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: