బాలయ్య షోకి జూనియర్ ఎన్టీఆర్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..!
దీంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక చర్చ కూడా జరిగింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావించారు కానీ ఎడిటింగ్లో తీసేసారని ప్రచారం కూడా ఎక్కువగా వినిపించింది. కానీ ఈ షోలో పాల్గొన్న డాకు మహారాజ్ చిత్ర నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వడం జరిగింది. షోలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన కానీ ,జై లవకుశ ప్రస్తావన రాకపోయినప్పుడు దానిని కట్ చేయాల్సిన అవసరం లేదని కూడా తెలియజేశారు. అయితే బయట ఆఫ్ ది రికార్డ్ గా మాట్లాడుకుంటున్న సమయంలో మాత్రం ఏదైనా ఒక పాత తన సినిమానీ జూనియర్ ఎన్టీఆర్ చేస్తే బాగుంటుందని బాలకృష్ణ అన్నారని వెల్లడించారు.
సినిమా విడుదలకు ముందు ఇలా చేయడం కరెక్ట్ కాదని ఎందుకంటే తాను అటు తారక్ గారి సినిమాలను, బాలయ్య గారి సినిమాలను కూడా చూస్తూ ఉంటానని రేపటి రోజున మోక్షజ్ఞ సినిమాలను కూడా చూస్తానని మాలాంటి వాళ్ళ మీలాంటి విభేదాల వల్ల బాధపడతామంటూ నాగవంశీ వెల్లడించారు. ఒకవేళ రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ షోకి రావచ్చు ఏమో చెప్పలేము కదా అంటూ నాగ వంశీ తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో అన్ స్టాపబుల్ షో కి జూనియర్ ఎన్టీఆర్ ని పిలిచి బాలయ్య హోస్ట్ చేయడం వంటివి జరిగితే ఇకమీదట ఇలాంటి రూమర్స్ ఉండవని చెప్పవచ్చు.