
ట్రైలర్: సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ రిలీజ్.. ఇరగదీసిన వెంకి మామ..బొమ్మ హిట్టే..?
ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, పాటలు కూడా బాగా హైప్ తీసుకోవచ్చాయి. తాజాగా చిత్ర బృందం ట్రైలర్ ని కూడా విడుదల చేయగా కామెడీ టైమింగ్ తో, ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్. ఈ సినిమా ట్రైలర్ ని మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో వెంకటేష్ పోలీస్ ఆఫీసర్గా మరొకసారి కనిపిస్తున్నారు. ఆయన భార్యకు ఐశ్వర్య రాజేష్ కనిపిస్తూ ఉండగా తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా మీనాక్షి చౌదరిని చూపించారు డైరెక్టర్ అనిల్ రావుపూడి.
ట్రైలర్ మొదట్లో కాస్త వైలెన్స్ చూపించిన ఆ తర్వాత మొత్తం కామెడీతో ఎమోషనల్, డ్రామా సన్నివేశాలతో ట్రైలర్ ని అద్భుతంగా చూపించారు. ఈ సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అన్నట్లుగా కనిపిస్తోంది. ట్రైలర్ తోనే ఆకట్టుకుంటున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా మరి సంక్రాంతి బరిలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇందులో మీనాక్షి చౌదరి నటన, వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ డైలాగ్ డిఫరెన్స్ షేడ్స్ లో కనిపించబోతున్నాయి. మొత్తానికి సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. మరి సంక్రాంతి విన్నర్ ఎవరు మరి కొద్ది రోజులలో తెలియబోతోంది.