గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం "గేమ్ చేంజర్" పొలిటికల్ యాక్షన్ త్రిల్లర్ గా ఈ సినిమాను రూపొందించారు. "గేమ్ చేంజర్" సినిమాకు స్టార్ట్ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించాడు. ఇటీవల శనివారం ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరంలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఫ్రీ రిలీజ్ వేడుకలకు పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఈ సినిమా జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా "గేమ్ చేంజర్" ప్రీ రిలీజ్ వేడుకకు అభిమానులు భారీగా తరలివచ్చారు.
ఈ వేడుకలో పాల్గొని తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో ఇద్దరు అభిమానులు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించారు. వారు కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) గా గుర్తించారు. అయితే ఈ రెండు కుటుంబాలకు పవన్ కళ్యాణ్ భారీ సాయాన్ని అందజేశాడు. ఏడీబీ రోడ్డుపై ప్రమాదంలో యువకుల మృతి చాలా బాధాకరమని పోస్ట్ షేర్ చేసుకున్నాడు.
జనసేన పార్టీ తరపున మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని అనౌన్స్ చేశాడు. కాకినాడ-రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు చిద్రమైపోయింది. గత ఐదేళ్లలో ఈ రోడ్డు గురించి ఎవరూ పట్టించుకోలేదు. పాడైపోయిన ఈ రోడ్డును బాగు చేస్తున్నారు. ఈ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారని తెలిసి ఆవేదనకు లోనయ్యానని పవన్ కళ్యాణ్ తెలిపారు. జనసేన పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు సహాయం అందజేశాడు.
ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందించే ఏర్పాటు చేయాలని నా కార్యాలయ అధికారులకు చెప్పానని తెలిపారు. ఇక నుంచి పిఠాపురం నియోజకవర్గ పర్యటనలకు ఏడిబి రోడ్డు మీదుగానే రాకపోకలు సాగించాలని నిర్ణయించుకున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే దిల్ రాజు మీడియా సమక్షంలో స్పందించాడు. నా వంతుగా వారి కుటుంబాలకు చేరో ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నానని అనౌన్స్ చేశాడు నిర్మాత దిల్ రాజ్.