కృష్ణంరాజు - శోభ‌న్‌బాబు - చిరంజీవి బ్లాక్‌బ‌స్ట‌ర్ల వెన‌క కృష్ణ‌.. ఇంట్ర‌స్టింగ్ ట్విస్ట్‌...!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

న‌ట‌శేఖ‌ర కృష్ణ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న అనేక సినిమాల్లో న‌టించారు. అంత‌కు మించిన సంఖ్య‌లో సినిమాల‌ను తీశారు కూడా. తెలుగు సినిమా రంగంలో 50 ఏళ్ల‌పాటు తన సత్తా చాటిన హీరో కృష్ణ‌.  ఆంధ్రా జేమ్స్‌బాండ్‌గా లక్షల మంది అభిమానులను సొంతం చేసుకున్న కృష్ణ తనకు వచ్చిన అవకాశాల్లో కొన్ని సినిమాలకు వేరే నటీనటులను తీసుకోవాలని సలహా ఇచ్చేవారట. కృష్ణ నిర్మాత‌ల మ‌నిషి .. ఆయ‌న ఎవ‌రికి అయినా సినిమా చేసి ఆ సినిమా ప్లాప్ అయితే వెంట‌నే ఆల‌స్యం లేకుండా .. త‌ర్వాత సినిమాకు అదే నిర్మాత కు ఫ్రీ గా కాల్షీట్లు ఇచ్చేసేవారు.

కొన్ని ఆయ‌నే వ‌దులుకున్న చిత్రాలు కూడా ఉన్నాయి. అలా ఆయన వదులుకున్న సినిమాల విష‌యాన్ని చూస్తే.. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం ఖైదీ కూడా ఉంది.  మొదట ఈ సినిమా స్క్రిప్ట్‌ కృష్ణ దగ్గరకు వచ్చిందట. కానీ, నిర్మాతలకు చిరంజీవిని తీసుకోవాలని ఆయన సూచించా రట. చిరంజీవి డ్యాన్స్ బాగా చేస్తారని.. అతడినే తీసుకోవాలని సూపర్‌స్టార్‌ కృష్ణ చెప్పడంతో నిర్మాత‌లు చిరును సంప్ర‌దించి ఓకేశారు. ఆ సినిమా ఎంత హిట్టో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

అలాగే కృష్ణంరాజు హీరోగా నటించిన కటకటాల రుద్రయ్య సినిమా కోసం దర్శకనిర్మాతలు మొదట కృష్ణని సంప్రదించారు. ఆయన షెడ్యూల్ బిజీకావ‌డంతో కృష్ణంరాజుకు అయితే ఆ స్క్రిప్ట్‌ బాగుంటుంద ని సూచించారట. ఇక‌, క‌ళాత‌ప‌స్వి కే విశ్వ‌నాథ్ తీసిన దేవాల‌యం మూవీ కూడా తొలుత కృష్ణ‌ను దృష్టిలో పెట్టుకుని క‌థ రాసుకున్నారు. అయితే.. చివ‌రిలో శోభ‌న్‌బాబు అయితే బాగుంటుంద‌ని ఆయ‌న‌ను ప్రిఫ‌ర్ చేయించార‌ట కృష్ణ‌. ఇలా.. అనేక సినిమాలు తాను వ‌దులుకోవ‌డంతో.. ఎంతో మంది వాటి ద్వారా పేరు తెచ్చుకోవ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: