గేమ్ ఛేంజర్ ఈవెంట్ కోసం వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్న ఇద్దరు యువకులు.. మెగా ఫ్యామిలీ స్పందిస్తుందా.?

Pandrala Sravanthi
అభిమాన నటుల కోసం చాలామంది ఫ్యాన్స్ ఎంత దూరమైనా వెళ్తున్నారు. చివరికి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు.  ఈ మధ్యకాలంలో బన్నీ అభిమాని అయినటువంటి రేవతి సినిమా కోసం వెళ్లి అక్కడ తొక్కిసలాటలో ప్రాణాలు పోగొట్టుకుంది.ఈ ఇష్యూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇది మరవకముందే గేమ్ ఛేంజర్ ఈవెంట్లో మరో ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఈవెంట్ కు హాజరైనటువంటి ఇద్దరు యువకులు ఈవెంట్ చేసుకొని తిరిగి బైక్ పై  తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించారని సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే ..రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా  అట్టహాసంగా జరిగింది. ఈ ఈవెంట్ కు వేలాదిమంది అభిమానులు వచ్చారు.

 దీనికి ఉప ముఖ్యమంత్రి నటుడు పవన్ కళ్యాణ్ కూడా వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రోగ్రాంకు మెగా అభిమానులైనటువంటి గైగోలు పాడుకు చెందిన మణికంఠ 23 తన స్నేహితుడైన చరణ్ తో కలిసి బైక్ పై వచ్చారు. ఈవెంట్ మొత్తం చాలా ఉత్సాహంగా గడిపారు.  ఆ తర్వాత రాత్రి తమ స్వగ్రామం కి బయలుదేరుతున్న సమయంలో రంగంపేట మండలం వడిషలేరు సమీపంలో కార్గిల్ ఫ్యాక్టరీ వద్ద వారి బైకును వెనుక నుంచి వ్యాన్ ఢీ కొట్టింది.  దీంతో వీరు తీవ్రంగా గాయాల పాలవ్వడంతో స్థానికులు ఆస్పత్రికి తరలిస్తున్న తరుణంలో ఇద్దరు మరణించారు.

ఈ విషయం చిత్ర యూనిట్ వారికి లేటుగా తెలియడంతో ద్రిక్పాంతి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మరి దీనిపై మెగా ఫ్యామిలీ స్పందించి వారికి ఏమైనా సాయం చేస్తుందా లేదంటే మాకెందుకులే అని సైలెంట్ గా ఉంటుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.అయితే ఈ విషయం మెగా ఫ్యామిలీకి తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్టు తెలుస్తోంది.ఇక ఈ విషయంపై త్వరలోనే మెగా ఫ్యామిలీ స్పందించి వారి ఫ్యామిలీ ని కలిసి సహాయం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: